పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

June 28, 2024

పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Nag Ashwin Remuneration: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ల పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక కల్కి సినిమాతో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా ద్వారా దర్శకుడుగా పరిచయమయ్యారు. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అనంతరం మహానటి సినిమా ద్వారా జాతీయ స్థాయిలో డైరెక్టర్ గా గుర్తింపు పొందారు.

ఇక కల్కి సినిమా ద్వారా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుని ఇక ఈ సినిమా ఏకంగా 600 కోట్ల బడ్జెట్ తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా నాలుగవ సినిమాకి ఇంత భారీ బడ్జెట్ కేటాయించి సినిమా తీశారు అంటే నాగీ విజినరీ ఏంటో అర్థం అవుతుంది.

ఇక చిన్నప్పటినుంచి సినిమాలపై ఎంతో ఆసక్తి ఉండడంతో సినిమా రంగంలోకి రావడం కోసం ఫిలిం కోర్సులు చేశారు. అలాగే సినిమా కథలను కూడా రాస్తూ ఉండడంతో సినిమాలపై ఉన్న ఆసక్తిని గమనించిన తన తల్లి ఈయనను శేఖర్ కమ్ముల గారికి పరిచయం చేశారు. ఇలా శేఖర్ కమ్ముల గారితో కలిసి ఆయన సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు.

ఇలా నాగ్ అశ్విన్ శేఖర్ కమ్ముల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్న సమయంలో మొదటి రెమ్యూనరేషన్ కేవలం 4000 రూపాయలు మాత్రమే అందుకున్నారని తెలుస్తుంది. ఇలా నాలుగు వేల రూపాయల నుంచి మొదలైన తన ప్రయాణం ఏకంగా 600 కోట్ల బడ్జెట్ సినిమా చేసే స్థాయికి ఎదిగారు అంటే ఈయన టాలెంట్ ఏంటో అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఈయన తల్లిదండ్రులు ఇద్దరు కూడా వైద్యులు అయినప్పటికీ ఈయన మాత్రం సినీ రంగాన్ని ఎంచుకున్నారు. చిన్నప్పటి నుంచి కూడా రానా, నాగ్ అశ్విన్ ఇద్దరు కూడా క్లాస్మేట్స్ కావటం గమనార్హం.

READ MORE: కల్కి 2898 ఏడీ రివ్యూ: సైన్స్ ఫిక్ష‌న్ మూవీతో ప్ర‌భాస్ హిట్ కొట్టాడా?

ట్రెండింగ్ వార్తలు