పవన్ కళ్యాణ్ విజయంపై అలాంటి ట్వీట్ చేసిన కమల్ హాసన్.. గర్వంగా ఉందంటూ!

June 8, 2024

పవన్ కళ్యాణ్ విజయంపై అలాంటి ట్వీట్ చేసిన కమల్ హాసన్.. గర్వంగా ఉందంటూ!

తాజాగా ఏపీలో ఎన్నికల ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో పవన్ కళ్యాణ్ అద్భుతమైన విజయం సాధించడంతో అటు రాజకీయ నాయకులు ఇటు సినిమా సెలబ్రిటీలు కుటుంబ సభ్యులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో వరుసగా ట్వీట్ లు చేస్తున్నారు. ఎన్నికలలో 21 స్థానాల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ 21 స్థానాలలో కూడా గెలిచి ఆఖండ విజయాన్ని సాధించారు. దాంతో సినీ ప్రముఖులు సైతం పవన్ విజయాన్ని అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు పవన్ కళ్యాణ్ ను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేయగా తాజాగా.. భారత లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కూడా పవన్ సాధించిన విజయంపై ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కమల్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఎన్నికల్లో విజయంపై పవన్‌తో జరిగిన సంభాషణ చాలా ఉద్వేగభరితమైనది. పవన్‌కు నా హృదయపూర్వక అభినందనలు.

ఏపీ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు సేవ చేసే ఈ యాత్రను ప్రారంభించినందుకు నేను ఆయనకు శుభాకాంక్షలు తెలిపాను. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది సోదరా అంటూ కమల్ హాసన్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. ఇప్పటికే గతంలో రెండు సార్లు ఎన్నికలలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. కానీ ఈసారి మాత్రం ఎవరు ఊహించిన విధంగా అఖండ విజయాన్ని అందుకొని తిట్టిన నోళ్ళతో శభాష్ అనిపించుకున్నారు పవన్ కళ్యాణ్.

Read More: ప్రభాస్ కల్కి ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా చంద్రబాబు.. ఈవెంట్ ఎప్పుడో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు