ఆ ఒక్క కారణంతోనే రోబో సినిమాలో నటించలేదు.. కమల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

July 2, 2024

ఆ ఒక్క కారణంతోనే రోబో సినిమాలో నటించలేదు.. కమల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న కమల్ హాసన్ ఇటీవల కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో ఈయన చేసిన పాత్రకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇలా ఇటీవల కాలంలో పలు సినిమాలలో క్యామియో రోల్స్ చేస్తున్న ఈయన మరోవైపు తన సినిమా పనులలో కూడా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 సినిమా పనులలో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న కమల్ హాసన్ తాజాగా భారతీయుడు 2 సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన రోబో సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోబో సినిమా సైతం శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే ఈ సినిమా ఎంత సక్సెస్ అయిందో మనకు తెలిసిందే.

నిజానికి ఈ సినిమాలో కమల్ హాసన్ నటించాల్సి ఉండగా కమల్ హాసన్ ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతో రజినీకాంత్ ఈ సినిమాలో నటించారని తెలుస్తోంది. తాను రోబో సినిమాలో చేయకపోవడానికి కారణాలను కమల్ హాసన్ తెలియజేస్తూ..ఐ-రోబో అనే ఇంగ్లీష్‌ నవలను సినిమాగా తీస్తే బాగుంటుందని రచయిత సుజాతతో పాటు నేను, దర్శకుడు శంకర్‌ 90దశకంలోనే ప్రయత్నాలు చేశాం. నా లుక్‌టెస్ట్‌ కూడా జరిగింది.

ఇకపోతే అప్పటి మార్కెట్ లెక్కల ప్రకారం ఈ సినిమా చేయాలి అంటే భారీ స్థాయిలోనే ఖర్చు అవుతుందని భావించాము ఆ సమయంలో భారీ బడ్జెట్ పెట్టి రిస్క్ చేయలేక ఈ సినిమా చేయాలనే ఆలోచన విరమించుకున్నామని తెలిపారు. అయితే శంకర్‌ మాత్రం కొన్నేళ్లపాటు ఆ స్క్రిప్ట్‌పై వర్క్‌ చేసి సరైన టైమ్‌లో సినిమా తీసి విజయం అందుకున్నారని ఈ సందర్భంగా కమల్ హాసన్ రోబో సినిమా గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

 

Related News

ట్రెండింగ్ వార్తలు