రజినీకాంత్ అంటే నాకు ఎలాంటి అసూయ లేదు..  కమల్ హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

July 3, 2024

రజినీకాంత్ అంటే నాకు ఎలాంటి అసూయ లేదు..  కమల్ హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Kamal Haasan Intresting Comments on Rajinikanth: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నటుడు కమల్ హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నారు. ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక త్వరలోనే కమల్ హాసన్ శంకర్ దర్శకత్వంలో నటించిన భారతీయుడు 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు ఈ సినిమా జూలై 12వ తేదీ విడుదల కాబోతుంది.

ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కమల్ హాసన్ రజనీకాంత్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రజనీకాంత్ కమల్ హాసన్ కాంబినేషన్లో సినిమా ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్న ఈయనకు ఎదురయింది.

ఈ ప్రశ్నకు కమల్ హాసన్ సమాధానం చెబుతూ రజినీకాంత్ గారితో నేను ఇదివరకే చాలా సినిమాలు చేశాను. ఇటీవల కాలంలో మా ఇద్దరి కాంబినేషన్లో ఎలాంటి సినిమాలు రాలేదు. అయితే మేము కలిసి సినిమాలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నాం. నాకు ఆయన అంటే ఏ విధమైనటువంటి అసూయ,పగ లేవని తెలిపారు.

ఇద్దరి దారులు విభిన్నంగా ఉంటాయి. మాకు నిర్మాత కె. బాలచందర్ గురువు. మా ఇద్దరి మార్గాలు వేరైన కేవలం పోటీతత్వమే ఉంటుంది. మేమేప్పుడు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోమని, మేము సీనియర్ హీరోల కనుక ఇలా ఉంటున్నాము అనుకోవడం పొరపాటు మేము గత 20 సంవత్సరాలుగా ఇలాగే ఉన్నామని ఇప్పటికీ మా మధ్య అదే స్నేహబంధం ఉంది అంటూ ఈ సందర్భంగా రజినీకాంత్ తో స్నేహం గురించి కమల్ హాసన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి

Related News

ట్రెండింగ్ వార్తలు