కల్కి సినిమాలో రివీల్ అయిన కమల్ రోల్ రన్ టైం.. కళ్ళు చెదిరేలా భారీ ఈవెంట్!

May 22, 2024

కల్కి సినిమాలో రివీల్ అయిన కమల్ రోల్ రన్ టైం.. కళ్ళు చెదిరేలా భారీ ఈవెంట్!

టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా కల్కి 2898AD. ఈ మూవీ కోసం నాగ్ అశ్విన్ కొత్త ప్రపంచమే సృష్టించారని, ఆ ప్రపంచం అందరూ ఆశ్చర్యపోయేలా ఉంటుందనే వార్తలు వెలువడటంతో పాటు ఇప్పటికే ఈ సినిమాలో టాప్ మోస్ట్ స్టార్స్ అందరూ నటించడం,హై బడ్జెట్ మూవీ కావటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ కూడా నటిస్తూ ఉండటంతో అతని పాత్ర పై అందరికీ ఆసక్తి పెరిగిపోయింది.

ఎలా కనిపిస్తారు? ఏ రోల్ చేస్తున్నారు? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆయన అభిమానులు. అయితే కమలహాసన్ మొన్న ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలో కల్కి సినిమాలో తాను గెస్ట్ రోల్ మాత్రమే చేస్తున్నానని చెప్పడంతో అందరూ డిసప్పాయింట్ అయ్యారు. అయితే కల్కి చిత్రంలో కమల్ హాసన్ పాత్ర రన్ టైం పై క్లారిటీ వచ్చింది. దాదాపు 20 నిమిషాల పాటు కమల్ హాసన్ స్క్రీన్ పై కనిపించబోతున్నారు.

అయితే పార్ట్ టూ లో మాత్రం 90 నిమిషాల వరకు కనిపించే అవకాశం ఉంటుందని సమాచారం. పార్ట్ టు గురించి పక్కన పెడితే పార్ట్ వన్ లో లోకనాయకుడు 20 నిమిషాలు కనిపిస్తున్నాడంటే మూవీ లవర్స్ ఎవరు బెంగపడవలసిన అవసరం లేదు. కమల్ రోల్ వచ్చినంత సేపు చూసి ఎంజాయ్ చేసేయడమే. అయితే ఈ సినిమా ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారంట మూవీ టీం. మే 22 సాయంత్రం 5:00 నుంచి హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ లో ఈవెంట్ జరగబోతుంది.

బుజ్జి అండ్ భైరవను కలవండి అంటూ ఈ ఈవెంట్ వివరాలను ప్రకటించారు మూవీ మేకర్స్. కల్కి టీం నుంచి నిర్వహిస్తున్న తొలి ఈవెంట్ ఇదే కావడంతో దీనిపై చాలా ఆసక్తి నెలకొంది. రామోజీ ఫిలిం సిటీ లో కళ్లు చెదిరేలా భారీ స్థాయిలో ఈ ఈవెంట్ జరగబోతుందని తెలుస్తోంది. సుమారు 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతుంది.

Read More: ఈవారం ఓటీటీ లో.. మన ముందుకి వస్తున్న చిత్రాలు!

ట్రెండింగ్ వార్తలు