కంగనా రనౌత్ ఆస్తుల గురించి తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే.. ఏకంగా అన్ని కోట్లా?

May 15, 2024

కంగనా రనౌత్ ఆస్తుల గురించి తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే.. ఏకంగా అన్ని కోట్లా?

తెలుగు సినీ ప్రేక్షకులకు బాలీవుడ్ నటి, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. కాగా కంగనా రనౌత్ సినిమాల ద్వారా కంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకుంది. తరచూ ఈమె ఎక్కువగా కాంట్రవర్సీలకు సంబంధించిన విషయాలలోనే వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో జరిగే పలు అంశాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. కాగా కంగనా ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో కంగనా ఆస్తులకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. మరి ఆమె ఆస్తుల వివరాల విషయానికి వస్తే.. 2022-23లో కంగనా 4.12 కోట్లు సంపాదించింది. 2021-22లో 12 కోట్ల ఆదాయం సంపాదించింది. అలాగే కంగనాపై ఎనిమిది కేసులు నమోదయ్యాయి. వాటిలో పరువు నష్టం, మతాల మధ్య శత్రుత్వం పెంచే ప్రయత్నాలు, మతపరమైన మనోభావాలకు హాని కలిగించడం, మోసం వంటి కేసులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కంగనా వద్ద రూ.2 లక్షలు ఉన్నాయి. బ్యాంకుల్లో రెండు కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇవే కాకుండా ఆమె 50 ఎల్‌ఐసీ పాలసీలు చేసింది. ఈ 50 ఎల్‌ఐసీ పాలసీల మెచ్యూరిటీ మొత్తం రూ. 5 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే సొంత నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిల్మ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 1.21 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టింది. అంతేకాకుండా తన తమ్ముడు, సోదరి రంగోలి, తండ్రి తదితరులకు రూ. 9.50 కోట్ల వరకు అప్పుగా ఇచ్చినట్లు తెలిపింది. కంగనా రనౌత్ పేరు మీద నాలుగు వాహనాలు ఉన్నాయి. అందులో ఒకటి వెస్పా స్కూటర్.

మిగతా మూడు వాహనాల మొత్తం విలువ రూ.5.48 కోట్లు. అలాగే కంగనా వద్ద 6.70 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. వీటి మొత్తం విలువ 5 కోట్ల రూపాయలు. 3 కోట్ల విలువైన వజ్రా ఆభరణాలు. 60 కిలోల వెండి వస్తువులు ఉన్నాయి. వాటి విలువ 50 లక్షల రూపాయలు. కంగనా రనౌత్ మొత్తం వారసత్వం 28.73 కోట్లు. కంగనాకు వ్యవసాయ భూమి లేదు. ముంబై, మనాలి, హిమాచల్ ప్రదేశ్‌లో రెండు భవనాలు ఉన్నాయట. వీటి ప్రస్తుత మొత్తం విలువ రూ.31.42 కోట్లు. కమర్షియల్, రెసిడెన్షియల్ మొత్తం ఆస్తి విలువ రూ.62.98 కోట్లు. అలాగే ఆమె పేరు మీద రూ. 15.58 కోట్ల అప్పు ఉన్నట్లు సమాచారం. నిర్మాణ సంస్థ అద్దె కోసం 1.80 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇప్పటివరకు కంగాన మొత్తం రూ. 154.57 కోట్లు సంపాదించింది. అలాగే అప్పు రూ. 17.38 కోట్లు ఉన్నట్లు తెలిపింది. ఈ వార్త పుస్తకం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమెకు ఉన్న బంగారు ఆభరణాలు డబ్బుల గురించి తెలిసి షాక్ అవుతున్నారు.

Read More: ద గోట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ షురూ.. జూన్ లో విడుదలకు సన్నాహాలు!

ట్రెండింగ్ వార్తలు