కన్నప్ప టీజర్ ని ఏకంగా అక్కడ రిలీజ్ చేస్తున్న మంచు విష్ణు.. ఆనందంగా ఉందంటూ ట్వీట్!

May 14, 2024

కన్నప్ప టీజర్ ని ఏకంగా అక్కడ రిలీజ్ చేస్తున్న మంచు విష్ణు.. ఆనందంగా ఉందంటూ ట్వీట్!

మంచు విష్ణు కథానాయకుడిగా కన్నప్ప సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఎప్పటినుంచో చెప్పుకొస్తున్న మంచు విష్ణు ఈ ప్రాజెక్టుని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వివిధ భాషల్లో అగ్రతారలను సినిమాలో కీలకపాత్రలకు తీసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరొక అప్డేట్ ఇచ్చారు విష్ణు.

మే 20వ తారీకున కన్నప్ప టీజర్ ని విడుదల చేయబోతున్నట్లు సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఎక్స్ లో ప్రకటించారు. అయితే టీజర్ విడుదల ఎక్కడ కాదు, ఏకంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో విడుదల చేస్తామంటూ ట్వీట్ చేశారు. మే 20వ తేదీన కన్నప్ప ప్రపంచాన్ని మీ అందరికీ చూపించేందుకు ఆగలేకపోతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో లాంచ్ కానుంది అంటూ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన పోస్టర్ సినిమాపై ఆసక్తిని రేపింది.

పోస్టర్ లో ఉన్న కత్తి డిజైన్ ప్రేక్షకులని ఆకర్షించింది. అలాగే ప్రభాస్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ముందు తాను ఒక క్యారెక్టర్ కోసం ప్రభాస్ ని అప్రోచ్ అయితే కధ అంతా విన్న ప్రభాస్ తనకి మరొక క్యారెక్టర్ నచ్చిందని, ఆ క్యారెక్టర్ చేస్తానని చెప్పారు. ప్రభాస్ తనకు నచ్చిన పాత్రను చేస్తున్నారు. తనంతట తాను సినిమా అప్డేట్స్ ఇచ్చేవరకు ఎలాంటి ఊహాగానాలని నమ్మవద్దని చెప్పి ఒక వీడియో కూడా విడుదల చేశారు మంచు విష్ణు.

ఈ సినిమాని మంచు ఫ్యామిలీకి చెందిన అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్ బాబు ప్రొడ్యూస్ చేస్తున్నారు. హిందీలో మహాభారత్ సిరీస్ కి దర్శకత్వం వహించిన దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ ఈ సినిమాకి రచయితలుగా వర్క్ చేస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు మూవీ మేకర్స్.

Read More: నటి పవిత్రా జయరామ్ ని తలుచుకొని ఎమోషనల్ పోస్ట్ చేసిన భర్త.. ఒక్కసారి తిరిగి రావా అంటూ?

ట్రెండింగ్ వార్తలు