August 29, 2022
పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్‌పూరి హీరోగా వచ్చిన ‘రొమాంటిక్’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు పరి శ్రమకు పరిచయం అయ్యారు కేతికా శర్మ. ఆ తర్వాత నాగశౌర్యతో ‘లక్ష్య’ అనే సినిమా తీశారు. ఈ రెండూ చిత్రాలూ కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. పైగా డిజాస్టర్స్‌గా నిలిచాయి. అయితే ఈ రెండు సినిమాలు ప్లాష్ కావడం పట్ల తాను ఏ మాత్రం పశ్చాతాపం చెందడం లేదని కేతికా శర్మ అంటున్నారు. తన కంట్రోల్‌లో లేని విషయాలను గురించి తాను ఏ మాత్రం ఆలోచించనని, ఓ యాక్టర్‌గా తాను ఏం చేయాలో, క్యారెక్టర్‌కు ఏం కావాలో అదే చేస్తానని చెబుతున్నారు కేతికా. తన కంట్రోల్‌లోని సినిమా రిజల్ట్ గురించి పెద్దగా ఆలోచించనని కూడా కేతికా పేర్కొన్నారు.
వైష్ణవ్‌తేజ్, కేతికా శర్మ జంటగా గీరిశాయ దర్శకత్వంలో రూపొందిన ‘రంగరంగవైభవంగా..’ సినిమా సెప్టెంబరు 2న థియేటర్స్‌లొ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కేతికా శర్మ పై విషయాలను చెప్పుకొచ్చారు. ఇక రంగరంగ వైభవంగా చిత్రం గురించి కేతికా మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో రాధ అనే అమ్మాయి పాత్రలో నటించారు. రాధా చాలా హానెస్ట్‌గా ఉంటుంది. ఓ సిస్టర్‌గా, కూతురుగా సక్సెస్‌పుల్‌గా ఉంటూ తన కెరీర్‌వైపు ముందుకు వెళ్తుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే రాధలోని ఏదో ఒక అంశం ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది. వైష్ణవ్ తేజ్‌తో నా కెమిష్ట్రీ బాగా కుదిరింది. రొమాంటిక్, లక్ష్య చిత్రాలతో యూత్‌కు దగ్గరయ్యాను. ఈ చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గర అవుతాను. ప్రభు,ప్రగతి వంటి సీనియర్ యాక్టర్స్‌తో ఈ సినిమాలో నటించడం నాకు హెల్ప్ అయ్యింది. నా యాక్టింగ్ ఇంప్రూవ్ అయ్యింది. భవిష్యత్‌లో ఓ బయోపిక్ చేయాలన్నది నా డ్రీమ్’’ అని చెప్పుకొచ్చారు కేతికా.
‘‘అమ్మా, నాన్న, తాతగారు అందరూ డాక్టర్సే. నా చిన్నతనంలో నేను షారుక్‌ఖాన్ ‘దిల్‌తో పాగల్‌హై’ సినిమా చూశాను. సిల్వర్‌స్క్రీన్‌పై కనిపించాలంటే ఏం చేయాలని మా అమ్మగారని అమాయకంగా అడిగితే యాక్టర్ కావాలని చెప్పారు. నేనూ యాక్టర్ అవ్వాలని డిసైడ్ అయిపోయాను. చక్ దే ఇండియా సమయంలో ‘ఎప్పటి కైనా నేను యాక్టర్ అవుతాను’’ అని నేను నా స్నేహితులతో చెప్పాను. దేవుడు దయ వల్లా నేను యాక్టర్ అయ్యాను. ప్రేక్షకులు కూడా ఆదరిస్తుంన్నందుకు సంతోషంగా ఉంది. ఈ క్రమంలో నా ఫ్యామిలీ సపోర్ట్‌ను నేను మరవలేను. మా నాన్నగారు నన్ను డాక్టర్‌గా చూడలనుకున్నారు. ఆయన రంగ రంగ వైభవంగా చిత్రంలో నేను రాధ అనే మెడికల్ స్టూడెంట్‌గా నటించాను. సో..ఈ రకంగా మా నాన్నగారి కలను నిజం చేశాననే తృప్తి కలిగింది నాకు’’ అని చెప్పుకొచ్చారు కేతికా శర్మ.