అల్లు అర్జున్ పై రెచ్చిపోతున్న కిరాక్ ఆర్పీ… ఆయన వెనుకున్నారనే ధైర్యమేనా?

June 12, 2024

అల్లు అర్జున్ పై రెచ్చిపోతున్న కిరాక్ ఆర్పీ… ఆయన వెనుకున్నారనే ధైర్యమేనా?

కిరాక్ ఆర్పీ పరిచయం అవసరం లేని పేరు జబర్దస్త్ కమెడియన్ గా పేరు ప్రఖ్యాతలు పొందిన ఈయన ఇటీవల కాలంలో జబర్దస్త్ నుంచి బయటకు వచ్చారు. అయితే మల్లెమాల వారి గురించి సంచలన ఆరోపణలు చేసి వార్తలలో నిలిచారు. అయితే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈయన చేపల పులుసు రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు. ఈ బిజినెస్ కూడా మంచిగా అభివృద్ధి చెందింది.

ఇలా చేపల పులుసు రెస్టారెంట్ బిజినెస్ నడుపుకుంటూ ఉన్నటువంటి ఆర్పీ ఇటీవల ఎన్నికలకు ముందు కూటమికి మద్దతు తెలిపారు. దీంతో పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కిరాక్ ఆర్పీ శృతి మించి వైఎస్ఆర్సిపి నేతలపై అలాగే నటుడు అల్లు అర్జున్ పై చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమార రేపుతున్నాయి.

ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ హీరో అయిన అల్లు అర్జున్ గురించి ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు నువ్వు అల్లు అర్జున్ అయితే నేను కిరాక్ ఆర్పీ . నువ్వు సినిమాలు చేసుకొని పాన్ ఇండియా స్టార్ అయితే ఎంతో సంతోషిస్తాను కానీ బన్నీ ఆర్మీ అంటే నేను ఒప్పుకోనని నీకు ఆర్మీ ఎక్కడి నుంచి వచ్చింది. నువ్వు సొసైటీ కోసం ఏం కృషి చేశావు ఎవరితో ఫైట్ చేశావు అంటు పెద్ద ఎత్తున ప్రశ్నల వర్షం కురిపించారు.

ఇలా అల్లు అర్జున్ గురించి ఈయన చేస్తున్న వ్యాఖ్యలపై బన్నీ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక కమెడియన్గా కొనసాగినటువంటి ఈయన ఒక పాన్ ఇండియా స్టార్ హీరోని ఇలా మాట్లాడటం వెనుక ఎవరో ఉన్నారని వారి ధైర్యంతోనే ఈయన ఇలా మాట్లాడుతున్నారనే వార్తలు కూడా వినపడుతున్నాయి. అయితే ఈయనకు మాటలు వెనుక నాగబాబు ఉన్నారని నాగబాబు చెప్పడం వల్లే ఇలా రెచ్చిపోయి ఆర్పీ మాట్లాడుతున్నారని తెలుస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ కి కాకుండా తన స్నేహితుడు వైసిపి నేత శిల్పా రవికి అల్లు అర్జున్ మద్దతు తెలియజేయడంతో నాగబాబు కూడా పరాయి వాడే అంటూ అల్లు అర్జున్ ఉద్దేశించి పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Read More: వామ్మో శ్రీ లీల ఏంటి ఇలా మారిపోయింది… గుర్తుపట్టలేనంతగా?

ట్రెండింగ్ వార్తలు