మరోసారి అల్లు అర్జున్ ను గెలికిన ఆర్పీ.. క్షమాపణలు చెప్పనంటూ ఫైర్?

July 3, 2024

మరోసారి అల్లు అర్జున్ ను గెలికిన ఆర్పీ.. క్షమాపణలు చెప్పనంటూ ఫైర్?

జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ ఇటీవల కాలంలో సంచలనంగా మారారు. ఈయన కూటమికి మద్దతు తెలియజేయడమే కాకుండా వైసీపీ నేతలపై తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలిచారు ముఖ్యంగా వైఎస్ఆర్సిపి నాయకులను టార్గెట్ చేస్తూ పలు ఇంటర్వ్యూలలో బూతులు మాట్లాడిన ఆర్పీ రాజకీయ నాయకులను మాత్రమే కాకుండా సినీ నటుడు అల్లు అర్జున్ పట్ల కూడా మాట్లాడారు.

అల్లు అర్జున్ వైసిపి నేత తన స్నేహితులు శిల్ప రవికి మద్దతు తెలియజేయడంతో ఈయనకు మండిపడ్డారు మెగా ఫ్యామిలీ ఈ విషయంలో నిన్ను ప్రశ్నించకపోయిన నేను ప్రశ్నిస్తానంటూ ఈయన అల్లు అర్జున్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇలా అల్లు అర్జున్ గురించి ఇష్టానుసారంగా ఈయన మాట్లాడటంతో బన్నీ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఈయన రెస్టారెంట్ల పై దాడులు కూడా చేశారు.

ఇలా ఈ వివాదాలు తర్వాత కాస్త సైలెంట్ అయిన ఈయన తిరిగి మరోసారి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని అల్లు అర్జున్ పై విమర్శలు చేశారు. ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్పీకు రిపోర్టర్ ప్రశ్నిస్తూ ఇకపై మీకు సినిమా అవకాశాలు రావడం కూడా కష్టమేనేమో అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ అల్లు అర్జున్ సినిమాలలో నటించే అవసరం నాకు లేదని తెలిపారు.

సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ప్రొడక్షన్ హౌస్ లు ఉన్నాయి ఆయన సినిమాలలో కాకపోతే మరో సినిమాలో నటిస్తాను కానీ నేను ఇప్పటివరకు విమర్శించిన వారికి క్షమాపణలు చెప్పనంటూ ఈ సందర్భంగా ఆర్పీ సంచలన వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా మనం ఎన్ని రోజులు బ్రతుకుతామో తెలియదు కానీ ప్రశ్నించే చద్దాం అంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి

ట్రెండింగ్ వార్తలు