February 5, 2022
రాజావారు రాణిగారు, ఎస్ ఆర్ కళ్యాణమండపం వంటి చిత్రాలతో సుపరిచితుడైన కిరణ్ అబ్బవరం నటించిన తాజా సినిమా ‘సెబాస్టియన్ పిసి524’. కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దరేకర్) హీరోయిన్లు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ నెల 24న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ రోజు టీజర్(Kiran Abbavaram Sebastian Teaser)ని విడుదల చేశారు.
రేచీకటి గల వ్యక్తి అసలు పోలీసు కానిస్టేబుల్ ఎలా అయ్యాడు. నైట్ డ్యూటీ ఎలా చేశాడనే ఆసక్తికరమైన పాయంట్ ఈ మూవీ తెరకెక్కిందని తెలుస్తోంది. ‘దయగల ప్రభువా… ఈ రాత్రి మదనపల్లి పట్టణ ప్రజలకు ఏ ఇబ్బందీ రాకుండా చూడు తండ్రి. నీకు స్తోత్రం’, ‘ప్రభువా… ఒకరాత్రి వీళ్లకు కళ్లు కనపడకుండా చూడు ప్రభువా! ఎన్ని వణుకుతాయో అర్థం కావడం లేదు’, ‘నేను దేవుడి బిడ్డను కాదన్నమాట’ అని హీరో చెప్పే డైలాగులు వినోదాత్మకంగా ఉన్నాయి. మొత్తం మీద సినిమాపై టీజర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. సోషల్ మీడియాలో ఈ టీజర్ ట్రెండింగ్ టాపిక్ అయ్యింది.
Read More: Allu Arjun: హరీష్ శంకర్ బన్నీని కలిసింది అందుకేనా?Kiran Abbavaram Sebastian Teaser :