మెగా ఫ్యామిలీకి లక్కీగా మారిన క్లిన్ కారా.. అన్ని శుభాలే?

June 5, 2024

మెగా ఫ్యామిలీకి లక్కీగా మారిన క్లిన్ కారా.. అన్ని శుభాలే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులుగా మారిన సంగతి మనకు తెలిసిందే. గత ఏడాది జూన్ 20 వ తేదీ ఈ దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇక ఈ చిన్నారికి క్లిన్ కారా అని నామకరణం కూడా చేశారు. ఈ విధంగా ఈ చిన్నారి పుట్టినప్పటినుంచి మెగా కుటుంబంలోనూ అలాగే మెగా అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ చిన్నారి జన్మించి ఏడాది అవుతున్న ఇప్పటివరకు ఈమె ఎలా ఉంటుందనే విషయాలను మాత్రం బయటకు తెలియజేయలేదు.

ఇదిలా ఉండగా తాజాగా క్లీన్ కారా మెగా కుటుంబానికి చాలా అదృష్టవంతురాలు అంటూ అభిమానులు పెద్ద ఎత్తున ఈ చిన్నారిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. క్లీన్ కారా మెగా కుటుంబంలోకి వచ్చిన తర్వాత మెగా కుటుంబానికి అన్ని శుభవార్తలే అవుతున్నాయని తెలిపారు. తన తాతయ్య చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు రావడం విశేషం అలాగే తన బాబాయ్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల వివాహ వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి.

ఇకపోతే తాజాగా తన చిన్న తాతయ్య అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఏపీ ఎన్నికలలో భారీ మెజారిటీతో విజయం సాధించడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించి దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు కూడా ఈయన పోటీ చేసిన ప్రతిచోట ఓడిపోతూనే ఉన్నారు కానీ ఈసారి మాత్రం గెలుపు తన సొంతం కావాలని భారీ స్థాయిలో కష్టపడ్డారు.

ఈ క్రమంలోనే ఏపీలో జరిగిన ఎన్నికలలో భాగంగా ఈయన పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎన్నికలలో సుమారు 70000 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన పవన్ కళ్యాణ్ కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ తరుణంలోనే మెగా అభిమానులు మెగా ప్రిన్సెస్ ఇంట్లోకి అడుగుపెట్టడంతోనే ఈ శుభాలన్ని జరుగుతున్నాయి అంటూ చిన్నారిపై కామెంట్లు చేస్తున్నారు.

Read More: నాగచైతన్యకు తల్లిగా స్టార్ హీరోయిన్.. ఇదేం ట్విస్ట్ రా బాబు!

ట్రెండింగ్ వార్తలు