కోబ్రా పని పూర్తి

January 5, 2022

కోబ్రా పని పూర్తి

‘కోబ్రా’కు కొబ్బరికాయ కొట్టారు హీరో విక్రమ్‌. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్‌ హీరోగా రూపొందుతున్న సినిమా ‘కోబ్రా’. ఈ సినిమా షూటింగ్‌ బుధవారం పూర్తయింది. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా ప్రకటించారు అజయ్‌జ్ఞానముత్తు. ఈ చిత్రంలో విక్రమ్‌ దాదాపు ఐదు గెటప్స్‌లో కనిపిస్తారు. ఇక కేజీఎఫ్‌ ఫేమ్‌ కృతీశెట్టి ఈ చిత్రంలో హీరోయిన్‌గా చేయగా, ఇండియన్‌ మాజీ క్రికె టర్‌ ఇర్ఫాన్‌పఠాన్‌ ఇందులో ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా చేశాడు. కోబ్రా సినిమా థియేటర్స్‌లో విడుదల అవుతుందా? లేక ఓటీటీకి వెళ్తుందా? అనేది చూడాలి. ఇక విక్రమ్, ఆయన తనయుడు విక్రమ్‌ ధృవ్‌ హీరోలుగా చేసిన ‘మహాన్‌’ సినిమా జనవరి 26న ఓటీటీలో విడుదదల కానుంది.

ReadMore: అప్పటివరకు వలిమై వాయిదా పడనట్లేనా?

ట్రెండింగ్ వార్తలు