టీటీడీ చైర్మన్ పదవి పై స్పందించిన నాగబాబు… అధికారకంగా వెల్లడిస్తారంటూ?

June 7, 2024

టీటీడీ చైర్మన్ పదవి పై స్పందించిన నాగబాబు… అధికారకంగా వెల్లడిస్తారంటూ?

2024 ఎన్నికలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి 164 సీట్లు కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈ కూటమిలో భాగంగా జనసేన కూడా పొత్తు పెట్టుకొని ఘనవిజయాన్ని సాధించింది. ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజారిటీ గెలుపొందారు. ఇక ఈయనకు ఏపీ కేబినెట్లో కీలక పదవులు కూడా రాబోతున్నాయని తెలుస్తోంది.

ఇక పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు మొదటి నుంచి కూడా జనసేన పార్టీ వెంటనే నడుస్తూ కార్యకర్తలకు పార్టీ నేతలకు ఎంతో అండగా నిలుస్తూ వచ్చారు. ఇక ఈ కూటమి గెలవడంతో నాగబాబుకి సైతం కీలక పదవి ఇవ్వబోతున్నారని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి బాధ్యతలను అందుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విధంగా నాగబాబు గురించి ఇలాంటి వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఆయన ఈ వార్తలపై స్పందించారు. ఈ విషయం గురించి నాగబాబు మాట్లాడుతూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తాను టీటీడీ చైర్మన్ గా ఎంపిక అయ్యాను అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదని తెలిపారు. నేను ఎలాంటి పదవులు ఆశించి పనిచేయలేదని ప్రజా సేవకు మాత్రమే పరిమితం అవుతానని ఈయన వెల్లడించారు.

నాకు పదవులపై ఎలాంటి వ్యామోహం లేదని ఒకవేళ ఇలాంటి పదవులు ఎవరికైనా అప్ప చెప్పాలని చూస్తే వాటిని అధికారకంగా ప్రకటిస్తారు అంటూ ఈ సందర్భంగా నాగబాబు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఈ దేవాలయం బాధ్యతలను ఎవరు తీసుకుంటున్నారు ఏంటి అనే విషయాల గురించి కూడా త్వరలోనే వెల్లడించనున్నారు.

Read More: చనిపోయేముందు ఎమ్మెస్ నారాయణ ఆ కోరిక కోరారా.. ఇన్నాళ్లకు బయటపెట్టిన బ్రహ్మానందం?

ట్రెండింగ్ వార్తలు