బ్రహ్మానందం, కోవై సరళని ఏమని పిలుస్తారో మీకు తెలుసా?

May 11, 2024

బ్రహ్మానందం, కోవై సరళని ఏమని పిలుస్తారో మీకు తెలుసా?

ఒకప్పటి నటీ లేడీ కమెడియన్ నటి కోవై సరళ గురించి మనందరికీ తెలిసిందే. కోవై సరళ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు బ్రహ్మానందం. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి ఒక్క సన్నివేశం కూడా సూపర్ హిట్టే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్నో సినిమాల్లో భార్యాభర్తలు గా నటించి ఇద్దరు వారి వారి స్టైల్లో కామెడీలు చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అయితే కామెడీ చేసి నవ్వించడంలో ఎవరికి వారు దిట్ట అని చెప్పవచ్చు. ఇప్పటికీ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సన్నివేశాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి.

కాగా బ్రహ్మానందం కోవై సరళ ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. ఎక్కువగా భార్యాభర్తలుగా కూడా నటించారు. ఒకానొక సమయంలో ఏ సినిమాలో బ్రహ్మానందంకి పెయిర్ కావాలన్నా కోవై సరళనే తీసుకొచ్చే వాళ్ళు. వాళ్ళిద్దరి పెయిర్ సూపర్ హిట్. ఆ పెయిర్ కి అభిమానులు కూడా ఉన్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా నటి కోవై సరళ అలీతో సరదాగా ప్రోగ్రాంలో పాల్గొనగా ఇందులో బ్రహ్మానందంతో ఉన్న అనుబంధం గురించి తెలిపింది. కోవై సరళ మాట్లాడుతూ.. బ్రహ్మానందం గారు నాకు అన్న, తండ్రిలా సలహాలు ఇచ్చేవారు.

ఆయనతో కలిసి చాలా సినిమాలు చేశాను. ఆయన నాతో ఎప్పుడైనా మాట్లాడితే.. సరళా చెల్లి ఏం చేస్తున్నావు, డబ్బులు దాచుకో, అవసరానికి పనికొస్తాయి. నీకు ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా నేనుంటాను అని అనేవారు. ఆయన అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం అని తెలిపింది. కాగా ఈ సందర్బంగా కోవై సరళ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read More: ఆ విషయంలో బాలయ్య బాబు కూతురిని ఫాలో అవుతున్నారా.. ఆ సక్సెస్ కు కారణం అదేనా?

ట్రెండింగ్ వార్తలు