బెల్లీ డాన్స్ చేస్తూ నడుమును తెగ ఊపుతున్న బేబమ్మ.. వైరల్ వీడియో!

February 10, 2024

బెల్లీ డాన్స్ చేస్తూ నడుమును తెగ ఊపుతున్న బేబమ్మ.. వైరల్ వీడియో!

కృతి శెట్టి పరిచయం అవసరం లేని పేరు. ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమయ్యారు నటి కృతి శెట్టి. ఈ సినిమాలో బేబమ్మ పాత్రలో నటించి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే ఈమె నటిస్తున్న తదుపరి రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ కావడంతో ఈమె క్రేజ్ భారీ స్థాయిలో పెరిగిపోయింది. ఇకపోతే మొదటి మూడు సినిమాల తర్వాత కృతి శెట్టి నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈమె కెరియర్ పరంగా కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

వచ్చిన అవకాశాలు అన్ని సద్వినియోగం చేసుకోకుండా కృతి శెట్టి అద్భుతమైన కథ చిత్రాలను ఎంపిక చేసుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈమె తెలుగు తమిళ భాష చిత్రాలతో పాటు మలయాళ భాషల్లో కూడా సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా ఒక వైపు కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఇటీవల కాలంలో ఈమె వెకేషన్ లోకి వెళ్లడం ఆ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకోవడం జరుగుతుంది.ఇటీవల ఒక వీడియోని కృతి శెట్టి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. తన గురువు సంజనతో కలిసి బీస్ట్ సినిమాలోని అరబిక్ కుతూ సాంగ్ కి చేసిన బెల్లీ డ్యాన్స్ వీడియోని కృతి పోస్ట్ చేసింది. ఈ డ్యాన్స్ కృతినే స్వయంగా కంపోజ్ చేసినట్టు తెలిపారు. ఇందులో ఈమె తన నడుమును తెగ ఊపుతూ ఈ పాటకు అద్భుతమైనటువంటి డాన్స్ చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బేబమ్మలో ఈ టాలెంట్ కూడా ఉందా చాలా చక్కగా డాన్స్ చేసింది అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Read More: ప్రియుడు కోసం నొప్పిని భరిస్తూ ఆ పని చేసిన బుల్లి తెర నటి?

ట్రెండింగ్ వార్తలు