గ్యాప్ ఇవ్వ‌లేదు..వ‌చ్చింది! హీరోయిన్ కామెంట్స్ వైర‌ల్‌

June 1, 2024

గ్యాప్ ఇవ్వ‌లేదు..వ‌చ్చింది! హీరోయిన్ కామెంట్స్ వైర‌ల్‌

ఉప్పెన బ్యూటి కృతిశెట్టి(Krithi Shetty) వ‌రుస అవ‌కాశాల్ని అందిపుచ్చుకున్న‌ప్ప‌టికీ పేల‌వ‌మైన స్క్రిప్ట్ సెల‌క్ష‌న్ కార‌ణంగా వ‌రుస ప్లాఫుల్ని చ‌వి చూడాల్సి వ‌చ్చింది. దాంతో టాలీవుడ్‌లో కాస్త గ్యాప్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం కృతిశెట్టి న‌టిస్తోన్న తెలుగు చిత్రం `మ‌న‌మే`..శ‌ర్వానంద్ హీరో..ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో ఇదే విష‌యం గురించి ప్ర‌స్తావించ‌గా `నేను గ్యాప్ ఇవ్వ‌లేదు..అదే వ‌చ్చింది..ప్ర‌స్తుతం త‌మిళ్, మ‌ల‌యాళంలో ఎక్కువ సినిమాలు చేస్తున్నాను కాబ‌ట్టి స‌హ‌జంగానే తెలుగులో గ్యాప్ వ‌చ్చింది. అంతే కాని ప్లాన్ చేసి తీసుకున్న‌ది కాదు` అని స‌మాధానం ఇచ్చింది.

ప్ర‌స్తుతం కృతిశెట్టి హీరోయిన్‌గా మ‌ల‌యాళంలో ఒక సినిమా, త‌మిళ్‌లో మూడు సినిమాలు చిత్రీక‌ర‌ణ ద‌శలో ఉన్నాయి. ఆ సినిమాల షూటింగ్ పూర్తి కాగానే తెలుగు ప‌రిశ్ర‌మ‌పై దృష్టి పెడ‌తాను అని చెప్పుకొచ్చింది. ఎన్ని సినిమాలు చేశాం అన్న‌ది కాదు..మ‌న‌స్పూర్తిగా అంద‌రికీ గుర్తుండిపొయే ఒక్క పాత్ర చేసిన చాలు..నంబ‌ర్ నాకు ముఖ్యం కాదు.. మంచి పాత్ర‌లే ముఖ్యం అని చెప్పింది.

క‌స్ట‌డి, మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఇలా గతేడాది వరుస ప్లాఫులు రావ‌డంతో కృతిశెట్టిని ప్ర‌క్క‌న పెట్టారు టాలీవుడ్ నిర్మాత‌లు. ఈ వేస‌విలో వ‌స్తోన్న మ‌న‌మే చిత్రంతోనైనా మ‌ళ్లీ వ‌రుస అవ‌కాశాలు అందుకుంటుందేమో చూడాలి.

Read MoreKrithi Shetty: డోస్ పెంచిన బేబమ్మ.. బ్లాక్ డ్రెస్‌లో అందాల జాతర..

ట్రెండింగ్ వార్తలు