రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించిన బేబమ్మ.. మరీ ఇంత ఇష్టమా?

June 3, 2024

రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించిన బేబమ్మ.. మరీ ఇంత ఇష్టమా?

కృతి శెట్టి పరిచయం అవసరం లేని పేరు. ఉప్పెన సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చే అందరి మదిలో బేబమ్మగా నిలిచిపోయినటువంటి ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు పెద్ద ఎత్తున అవకాశాలు వచ్చాయి. కానీ మిగతా సినిమాలు ఏవి కూడా ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయాయి దీంతో ఈమెకు తెలుగులో కాస్త అవకాశాలు తగ్గాయి.

ఇక త్వరలోనే కృతి శెట్టి శర్వానంద్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రాబోతున్న మనమే అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా జూన్ 7వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి బేబమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో తన ఫేవరెట్ హీరో గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనుకు రామ్ చరణ్ అంటే ఇష్టం అనే విషయాన్ని పలు సందర్భాలలో ఇదివరకే తెలియజేశారు. అయితే మరోసారి రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ ఈమె ఆయనపై ప్రశంసల కురిపించారు. రామ్ చరణ్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. ఇంతకుముందు ఆయన నటించిన సినిమాలు చూశాను కానీ రంగస్థలం సినిమా చూసిన తర్వాత రామ్ చరణ్ కు పెద్ద అభిమానిగా మారిపోయానని తెలిపారు.

అంతేకాకుండా రామ్ చరణ్ సినిమాల పట్ల చాలా డెడికేషన్ చూపిస్తారని,అందరితో మంచిగా ఉంటారని, అందరికి రెస్పెక్ట్ ఇస్తారని విన్నాను. రామ్ చరణ్ తో ఛాన్స్ వస్తే చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతాను. అలాగే ఆయనతో సినిమా ఛాన్స్ వస్తే ఆ సినిమా కోసం ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తానని తెలిపింది. ఇలా రామ్ చరణ్ గురించి కృతి శెట్టి ఈ రేంజ్ లో గొప్పగా చెప్పడంతో ఇది విన్నటువంటి అభిమానులు రామ్ చరణ్ అంటే కృతి శెట్టికి అంత ఇష్టమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read More: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో ఛాన్స్ అందుకోబోతున్న బ్యూటీ.. లక్ అంటే ఇదే?

ట్రెండింగ్ వార్తలు