July 24, 2024
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న మహేష్ బాబు ఇప్పటివరకు కేవలం తెలుగు చిత్ర పరిశ్రమ వరకు మాత్రమే సినిమాలు చేశారు. ఫస్ట్ టైమ్ రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఒక కొత్త సినిమాకు కమిటైన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా పాన్ వరల్డ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా మహేష్ బాబుకి సంబంధించి ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గతంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మహేష్ బాబు తన సినిమాల గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు తెలియజేశారు. నా సినిమాలకు తన తండ్రి కృష్ణ గారు పెద్ద క్రిటిక్ అని తెలిపారు ఆయన సినిమా గురించి ఎలాంటి రివ్యూ ఇస్తారో సినిమా రిజల్ట్ కూడా అలాగే ఉంటుందని తెలిపారు. నాన్న సినిమా బాగా లేకపోతే అసలు మాట్లాడరు. నచ్చితే బాగుందని చెబుతారు. ఇక నాన్న బాగుంది అంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని మహేష్ తెలిపారు.
ఇక నా సినిమాలకు నాన్నతో పాటు మరొక వ్యక్తి కూడా క్రిటిక్ గా ఉన్నారని తెలిపారు. ఆయన మరెవరో కాదు తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అని వెల్లడించారు. నా సినిమా వస్తుంది అంటే తప్పకుండా కేటీఆర్ గారు సినిమా చూస్తారని అలాగే తన అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తారని ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. సినిమా బాగా లేకపోతే మాత్రం బాగాలేదని చెబుతారు. అలా ఆగడు సినిమా చూసి తనకు ఫోన్ చేసి ఇంకోసారి ఇలాంటి చెత్త సినిమాలు చేయకు మహేష్ అంటూ వార్నింగ్ ఇచ్చారని స్వయంగా మహేష్ బాబు వెల్లడించారు
Read More: Mahesh Babu: ఇలా నవ్వి చాలా రోజులైంది!