ప్రపంచం తెలియని నాకు ప్రపంచాన్ని పరిచయం చేశారు.. కుమారి ఆంటీ ఎమోషనల్ కామెంట్స్?

April 1, 2024

ప్రపంచం తెలియని నాకు ప్రపంచాన్ని పరిచయం చేశారు.. కుమారి ఆంటీ ఎమోషనల్ కామెంట్స్?

కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు. హైదరాబాద్ నగరంలో ఒక ఫుడ్ స్టాల్ నడుపుకుంటూ జీవనోపాధిని వెతుకు ఉన్నటువంటి ఈమె ఉన్నపలంగా సెలబ్రిటీగా మారిపోయారు. సోషల్ మీడియా వేదికగా ఈమె ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఈమెతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ తీసుకుంటూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇలా సోషల్ మీడియా వేదిక కుమారి ఆంటీకి సంబంధించిన ఎన్నో వీడియోలు అలాగే ఈమె మాట తీరుకు సంబంధించిన కొన్ని వీడియోలు అన్నిటిని కూడా మిక్స్ చేసి ఒక డీజే సాంగ్ క్రియేట్ చేశారు. ఇలా సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ఏకంగా బుల్లితెర కార్యక్రమాలలో నటించే అవకాశాలను కూడా అందుకున్నారు.

ఇలా బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేసినటువంటి కుమారి ఆంటీ తాజాగా డిజిటల్ మీడియా ఫ్యాక్టరీ అనే కార్యక్రమంలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అసలు నేనేంటో నా జీవితం ఏంటో సరిగా నాకే తెలియదు. ఈ ప్రపంచం అంటే ఏంటో తెలియని నాకు ఈ ప్రపంచాన్ని చూపించారని నేడు ఈ స్థాయిలో నన్ను నిలబెట్టారు అంటూ ఈమె ఎమోషనల్ అయ్యారు.

ఈ విధంగా కుమారి ఆంటీ ఈ వేదికపై ఎంతో ఎమోషనల్ అవ్వడమే కాకుండా ఎంతో స్ఫూర్తినిచ్చే ఓ పద్యాన్ని కూడా ఆలపించారు.ఆత్మవిశ్వాసం ఉంటే ముందుకు వెళ్లొచ్చు అని, చదువు లేదని ఎప్పుడూ బాధ పడుతూ ఉంటే, అలా బాధ పడవద్దని, భక్తికి ముక్తికి చదువులెందుకు. ఆత్మ శాంతి ఉంటే అదే ధైవమూ, చెరువులోనా చేపకెవరు ఈత నేర్పిరి.. … అంటూ ఆమె స్ఫూర్తిని కలిగించే పద్యాన్ని చెప్పి అందరిని ఆకట్టుకున్నారు.

Read More: చిరంజీవి ఇంట్లో దొంగగా మారిన సుమ.. అసలు విషయం చెప్పిన మెగాస్టార్?

ట్రెండింగ్ వార్తలు