మరో బుల్లితెర షోలో కుమారి ఆంటీ.. ఇక ఈమె ఫుడ్ బిజినెస్ క్లోజ్ అయినట్టేనా?

February 12, 2024

మరో బుల్లితెర షోలో కుమారి ఆంటీ.. ఇక ఈమె ఫుడ్ బిజినెస్ క్లోజ్ అయినట్టేనా?

కుమారి ఆంటీ రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ పెట్టుకొని ఎన్నో రకాల నాన్ వెజ్ ఐటమ్స్ తయారు చేసి ఫుడ్ బిజినెస్ ప్రారంభించారు. ఇలా ఈమె చేతి వంట అద్భుతంగా ఉండడంతో ఎంతోమంది ఇక్కడికి భోజనం చేయడానికి వచ్చేవారు తక్కువ ధరలకే కడుపునిండా భోజనం పెట్టేవారు ఇలా ఫుడ్ బిజినెస్ జరుపుకుంటూ ఉన్నటువంటి కుమారి ఆంటీ వద్దకు ఎంతోమంది కస్టమర్లు రావడంతో పలువురు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా ఈమె దగ్గరికి వెళ్లి ఇంటర్వ్యూలు చేశారు తద్వారా బాగా పాపులర్ అయింది.

ఇక ఈమె 2 లివర్స్ ఎక్స్ట్రా థౌసండ్ అయిందని చెప్పినటువంటి మాటలు భారీగా పాపులర్ కావడంతో ఎన్నో రకాల రీల్స్ కూడా వచ్చాయి. అంతేకాకుండా డిజె సాంగ్ కూడా క్రియేట్ చేశారు. ఇలా సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులర్ అయినటువంటి ఈమె ఏకంగా బుల్లితెర కార్యక్రమాలలో కూడా పాల్గొని సందడి చేయబోతున్నారు. ఇప్పటికే స్టార్ మా లో ప్రసారంకాబోతున్న బిగ్ బాస్ ఉత్సవ్ కార్యక్రమంలో ఈమె పాల్గొని బిగ్ బాస్ కంటెస్టెంట్ లందరికీ కూడా తన చేతి వంట రుచి చూపించారు.

ఇలా స్టార్ మాలో సందడి చేసినటువంటి ఈమె మరో బుల్లితెర షోలో కూడా పాల్గొన్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. కుమారి ఆంటీ ఈటీవీలో ప్రసారమవుతున్నటువంటి శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏం కావాలి నాన్న అంటూ కుమారి ఆంటీకి మాట్లాడటంతో వెంటనే హైపర్ ఆది మీ బిజినెస్ ట్రిక్ ఇదే కదా అంటూ ఆమె పట్ల సెటైర్స్ వేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో ఈమెను పెద్ద ఎత్తున పాపులర్ చేస్తూ సెలబ్రిటీ హోదాని కల్పించారు. ఈ మాయలో పడి తన ఫుడ్ బిజినెస్ క్లోజ్ చేసుకుంటుందని అనంతరం బుల్లితెర చానల్స్ వాళ్ళు కూడా ఆమెను వదిలేస్తారని ఇప్పటికే ఇలా ఈ కార్యక్రమాల ద్వారా కండక్టర్ ఝాన్సీ లాంటివారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు అంటూ ఈమె పట్ల కామెంట్లు చేస్తున్నారు.

Read More: లవర్స్ డే స్పెషల్.. రీ రిలీజ్ కాబోతున్న బేబీ!

ట్రెండింగ్ వార్తలు