August 24, 2022
ఆమిర్‌ఖాన్ కెరీర్‌లోనే డిజాస్టర్‌గా నిలిచిన చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్‌గంప్’కు హిందీ రీమేక్‌గా ‘లాల్‌సింగ్ చద్దా’ సినిమాను తెరకెక్కించారు. అద్వైత్ చందన్ దర్శకుడు. యాక్టర్ అతుల్ కులకర్ణి ఈ సినిమాకు రైటర్‌గా వర్క్ చేశాడు. ఆగస్టు 11న విడుదలైన ఈ సినిమా మొదటి షో నుండే డిజాస్టర్‌గా నిలిచింది. హిందీతో పాటు ఇతరభాషల్లో ఈ సినిమాను విడుదల చేసినా పెద్దగా ఫలితం లేదు. ఈ సినిమా బడ్జెట్ 180 కోట్లు. కానీ కనీస వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది.
దేశీయంగా ‘లాల్‌సింగ్ చద్దా’ సినిమా డిజాస్టర్‌గా నిలిస్తే విదేశీ మార్కెట్‌లో మాత్రం సరికొత్త రికార్డు సృష్టిం చింది. ఈ ఏడాది ఇప్పటివరకు విడుదలైన హిందీ చిత్రాల విదేశీ కలెక్షన్స్‌లో లాల్‌సింగ్ చద్దా సినిమాయే హయ్యెస్ట్ కావడం విశేషం. 7.5 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్‌తో లాల్‌సింగ్ చద్దా ఈ రికార్డును సొంతం చేసుకుంది. ఇక 7.4 మిలియన్ డాలర్స్‌తో గంగుభాయి కతియావాడి, 5.8 మిలియన్ డాలర్స్‌తో కార్తిక్ ఆర్యన్ ‘భూల్‌భూలయ్యా 2’, 5.7 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్‌తో హిందీ హిట్ ఫిల్మ్ ‘కశ్మీరీ ఫైల్స్’ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.