Raj Tarun VS Lavanya: రాజ్ నాకు అబార్షన్ చేయించారు.. సంచలన ఆరోపణలు చేసిన లావణ్య!

July 10, 2024

Raj Tarun VS Lavanya: రాజ్ నాకు అబార్షన్ చేయించారు.. సంచలన ఆరోపణలు చేసిన లావణ్య!

Raj Tarun VS Lavanya: సినీ నటుడు రాజ్ తరుణ్ ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే. లావణ్య అనే యువతితో దాదాపు 11 సంవత్సరాల పాటు రిలేషన్ లో ఉన్నటువంటి ఈయన ప్రస్తుతం తనకు దూరం కావడంతో ఈమె సంచలనమైన ఆరోపణలు చేస్తున్నారు. రాజ్ తరుణ్ తాను ప్రేమించుకున్నామని 11 సంవత్సరాల పాటు కలిసి ఉన్నామని తెలిపారు. అంతేకాకుండా మేమిద్దరం గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నామని తెలిపారు. ఇక ఈమె చేస్తున్న ఆరోపణలపై రాజ్ తరుణ్ కూడా స్పందిస్తూ తనతో కలిసి ఉన్న మాట వాస్తవమే కానీ తనని మోసం చేయలేదని ఆమె వేరే వ్యక్తితో రిలేషన్ లో ఉందని తెలిపారు.

ఇక మేము ఇద్దరం పెళ్లి కూడా చేసుకోలేదని రాజ్ తరుణ్ వెల్లడించారు. ఇకపోతే రాజ్ తరుణ్ విషయంలో లావణ్య రోజుకు ఒక సంచలనమైన ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచారు. ఈయనకు హీరోయిన్లతో కూడా అఫైర్స్ ఉన్నాయని బిగ్ బాస్ అరియానాతో కూడా తనకు రిలేషన్ ఉంది అంటూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇకపోతే తాజాగా మరో సంచలనమైన విషయాన్ని బయట పెట్టారు. నాకు పదేళ్ల క్రితమే పెళ్లయింది. పదేళ్లుగా మేం కాపురం చేస్తున్నాం. కొన్నాళ్ల క్రితం రాజ్‌తరుణ్‌ నాకు అబార్షన్‌ చేయించాడు. మెడికల్ డాక్యుమెంట్స్‌ను పోలీసులకు అందించానని లావణ్య తెలియజేశారు. నేను లావణ్య అలియాస్‌ అన్విక పేరుతో కలిసి ఉన్నాం. అన్విక పేరుతో విదేశాలకు కూడా కలిసి వెళ్లాం. మాల్వీ మల్హోత్రా వచ్చాక రాజ్‌ తరుణ్‌ నన్ను దూరం పెట్టాడని పోలీసులకు స్పష్టం చేసింది.

ఈ విధంగా ఈమె ఆధారాలు అన్నింటిని కూడా సమర్పించడంతో నార్సింగ్ పోలీసులు నటుడు రాజ్ తరుణ్ పై ఐపీసీ 493 సహా మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో లావణ్య సమర్పించిన ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మరి వీరి వ్యవహారం ఏమలుపు తిరుగుతుందో తెలియాల్సి ఉంది.

ట్రెండింగ్ వార్తలు