గాయాలు పాలైన నటి లావణ్య త్రిపాఠి.. ఆందోళనలో మెగా ఫ్యామిలీ.. ఏమైందంటే?

June 13, 2024

గాయాలు పాలైన నటి లావణ్య త్రిపాఠి.. ఆందోళనలో మెగా ఫ్యామిలీ.. ఏమైందంటే?

సినీనటి లావణ్య త్రిపాటి గురించి మెగా అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది నవంబర్ ఒకటవ తేదీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో కలిసి ఏడడుగులు నడిచిన లావణ్య త్రిపాఠి ఇటీవల కాలంలో ఎక్కడికి వెళ్ళినా మెగా కుటుంబంతో కలిసి కనిపిస్తున్నారు. ఇక ఈమె తన భర్తతో కలిసి వెకేషన్ లకు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇకపోతే పవన్ కళ్యాణ్ ఎన్నికలలో భారీ విజయం సాధించిన తర్వాత మెగా ఇంట్లో పెద్ద ఎత్తున సంబరాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే చిరు ఇంట్లో జరిగిన ఈ సెలబ్రేషన్స్ కి మెగా కుటుంబానికి చెందిన ప్రతి ఒక్కరు కూడా హాజరై సందడి చేశారు. ఆ సమయంలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరూ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక ఇటీవల జరిగిన ప్రమాణ స్వీకారానికి మాత్రం మెగా కుటుంబ సభ్యులందరూ హాజరైన వరుణ్ లావణ్య కనిపించలేదు.

ఇలా లావణ్య వరుణ్ కనిపించకపోవడంతో ఏం జరిగింది అనే విషయంపై మెగా అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా వేదికగా హీలింగ్ అంటూ తన కాలి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీనితో ఈమెకు కాలికి గాయం అయిందని నడవలేని పరిస్థితిలో ఉన్నారని తెలుస్తోంది.

ఆమె షేర్ చేసిన ఫోటో చూస్తుంటే తన కాలికి పెద్ద ప్రమాదమే జరిగిందని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇలా లావణ్య త్రిపాటి కాలికి గాయం కావడంతో అసలు ఏం జరిగింది? ఎందుకు అంత పెద్ద కట్టువేశారు అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇలా కాలికి గాయం కావడంతోనే ఈమె ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈమెకు ఏం జరిగిందో తెలియదు కానీ ఆమె మాత్రం తొందరగా కోలుకోవాలి అంటూ మెగా అభిమానులు ఈ ఫోటోపై కామెంట్లు పెడుతున్నారు.

Read More: నాలుగు నెలలకే గర్భస్రావం.. డిప్రెషన్ లోకి వెళ్లిపోయా: నమిత

ట్రెండింగ్ వార్తలు