December 16, 2021
టాలీవుడ్ సన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తొలి ప్యాన్‌ఇండియన్ మూవీ ‘లైగర్’ రిలీజ్ డేట్ కన్ఫార్మ్ అయ్యింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 25న థియేటర్స్‌లోకి రానుంది. అయితే ఈ విడుదల తేదీని ఓ సారి గమనించినట్లయితే…2017లో ఆగస్టు 25న విడుదలైన విజయ్ దేవరకొండ ఫిల్మ్ ‘అర్జున్‌రెడ్డి’. ఈ సినిమా విజయ్ కెరీర్‌ను ఏ రేంజ్‌లో మలుపు తిప్పిందో అందరికీ తెలుసు. ‘వరల్డ్‌ఫేమస్ లవర్’, ‘నోట’ వంట సినిమాలతో ప్లాప్స్‌ను చూసిన విజయ్‌కెరీర్‌కు ఇప్పుడు హిట్ కచ్చితంగా కావాలి. అందుకే ఈ సినిమా విషయంలో విజయ్ అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.