‘లైగర్‌’ మైనస్‌ పాయింట్స్ ఇవేనా?

August 25, 2022

‘లైగర్‌’ మైనస్‌ పాయింట్స్ ఇవేనా?

విజయ్‌దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వ‌చ్చిన‌ ‘లైగర్‌’ సినిమాకు ఆడియన్స్‌ నుంచి మిశ్ర‌మ స్పంద‌న‌ వస్తోంది. కథలో నెగటివ్‌లు ఇవే అని కొందరు నెటిజన్లు ట్వీట్స్‌ చేస్తున్నారు. అవి ఏంటో మీరు కూడా ఓ లుక్కేయండి..

– బాలామణి(రమ్యకృష్ణ) భర్త ఎమ్‌ఎమ్‌ఏ చాంపియన్‌షిప్‌ను సాధించడంలో మరణించాడన్న ప్రస్తావన పదే పదే తెరపైకి వస్తుంది. కానీ 2004 ఎమ్‌ఎమ్‌ఏ చాంపియన్‌ షిప్‌ టోర్నమెంట్‌ ఎలా జరిగింది? బాలామణి భర్త బలరాం ఎవరితో చేతిలో చనిపోయాడు అన్నది మచ్చుకైనా స్క్రీన్‌పై కనిపించదు.

– లైగర్‌ (విజయ్‌ దేవరకొండ) ఇంటర్‌నేషనల్‌ చాంపియన్‌షిప్‌ గెలవడానికి లాస్‌ వేగాస్‌ రావాల్సి ఉంటుంది. కనీసం ఎంట్రీ కోసం డబ్బులు కూడా లేని లైగర్‌ అండ్‌ టీమ్‌కు హీరోయిన్‌ తండ్రి ముంబై నుంచి ఓ స్పెషల్‌ జెట్‌ను వేస్తాడు. ఈ రేంజ్‌లో ఉండే వ్య‌క్తి ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌ కొనడానికి ఓ మాఫియా డాన్‌ దగ్గర చేసిన అప్పుని తీర్చ‌క‌పోవ‌డం వింతగా ఉంటుంది.

– కొడుకు విదేశాల్లో ఎమ్‌ఎమ్‌ఏ టోర్నమెంట్‌కు వెళ్లిన‌ప్పుడు త‌న త‌ల్లి కూడా వెళ్తుంది. ఆ త‌ర్వాతి మ్యాచ్‌లో మాత్రం ముంబైలో ఉంటూ టీవీలో చూస్తూ అతన్ని ప్రొత్సహిస్తూ ఉంటుంది. కానీ క్లైమాక్స్‌లో మాత్రం అంటే..ఎవరైతే లైగర్‌కు ప్రవైట్ జెట్‌ వేశారో వారు డబ్బుల్లేక, కూతురు కిడ్నాప్‌ అయి బాధల్లో ఉంటే అప్పుడు బాలామణి లాస్‌వేగాస్‌కు వచ్చేస్తుంది. ఇదో వింత.

– లైగర్‌ అంటే సంజు(విషు రెడ్డి)కు ఏ మాత్రం పడదు. పైగా తన చెల్లిని ప్రేమించడం, నేషనల్‌ ఎమ్‌ఎమ్‌ఏ చాంపియన్‌షిప్‌లో లైగర్‌ తనను ఓడించడం అనేవి సంజుకు ఓకే కాదు. కానీ తన తండ్రి ఎమ్‌ఎమ్‌ఏ ఇంటర్ నేషనల్‌ చాంపియన్‌షిప్‌లో పార్టిస్‌పేట్‌ చేయడానికి లైగర్‌కు స్పాన్స్‌ర్‌ చేస్తుంటే సంజు ఏం చేశాడు. కథలో అంతే ఉంది మరి.

– విజయ్‌దేవరకొండ బాగా పాపులర్‌ అయ్యింది తన అగ్రెసివ్‌ డైలాగ్స్‌తోనే. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్‌కు నత్తి పెట్టి విజయ్‌ను కట్టడి చేశాడు పూరీ. ఇది బాగా మైనస్‌ అయ్యింది. కేవలం ఒక్క ఫైట్‌ చూసే హీరో హీరోయిన్‌తో లవ్‌లో పడటం, నత్తి ఉందని ముందే తెలిసినా అదే కారణంతో అతన్ని విడిచి వెళ్లిపోవడం, ఆ తర్వాత అతని మేలు కోసమే హీరోయిన్‌ అలా చేసిందని చెప్పడం 1960 నాటి కథలు. ఇలా చెప్పుకుంటూ పోతే లైగర్‌లో చాలానే ఉన్నాయి మైనస్‌ పాయింట్లు.

–ప్రీ క్లైమాక్స్‌లో లేడీ ఫైటర్స్‌ విజయ్‌దేవరకొండతో ఫైట్‌ చేసే ఎపిసోడ్‌ దండగ. నేష‌న‌ల్ మ్యాచ్ ల‌లో అంత‌మంది ఫైట‌ర్ల‌ను చిత్తు చేసి లేడి ఫైట‌ర్ల‌తో త‌న్నులు తిన‌డం అర్థం కాని విష‌యం. ఇక క్లైమాక్స్‌లో మైక్‌టైసన్‌ ఎపిసోడ్‌ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఫైట్‌ కూడా అస్స‌లు బాగోలేదు. ఓ కమెడియ‌న్ ని చేశారు. ఇక చివ‌ర్లో కోకా సాంగ్‌ అవసరమే లేదు. షూట్‌ చేసి ఎక్కడ పెట్టాలో తెలియక రోలింగ్‌ టైటిల్స్‌ ముందు పెట్టినట్లు ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు