December 29, 2021
Liger Update: విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రాబోతోన్న పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్) ద్వారా డైనమేట్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్ మీదకు పరిచయం కాబోతోన్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. లైగర్ మ్యాడ్ నెస్‌ను వీక్షించేందుకు రెడీగా ఉండండి.. డిసెంబర్ 31న ఉదయం 10:03 గంటలకు ఫస్ట్ గ్లింప్స్ రాబోతోందని ప్రకటించారు.
డిసెంబర్ 30న రెండు స్పెషల్ ట్రీట్‌లు ఉండబోతోన్నాయి. సినిమాకు సంబంధించిన స్పెషల్ స్టిల్స్‌ను ఉదయం 10:03 గంటలకు విడుదల చేస్తుండగా.. ఇన్ స్టా ఫిల్టర్‌ను సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయబోతోన్న విషయం తెలిసిందే. లైగర్ చిత్రం ఆగస్ట్ 25న విడుదల కాబోతోంది.
ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.