December 14, 2021
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్‌దేవరకొండ ప్రజెంట్ లైగర్ సినిమా చేస్తున్నాడు. సెప్టెంబరు 10న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. లైగర్ రిలీజ్ ఎప్పుడూ అంటే ఆ ఒక్కటీ అడక్కు అంటున్నారు విజయ్ దేవరకొండ అండ్ టీమ్. షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు క్యూ కట్టిన సినిమాలతోనే ఆల్రెడీ జనవరి, ఫిబ్రవరి ఫుల్లైపోయింది. కేజీఎఫ్ 2, లాల్‌సింగ్ చద్దా, పొన్నియిన్‌సెల్వన్, సర్కారువారి పాట, సలార్ వంటి భారీ చిత్రాలతో ఏప్రిల్ పవర్‌ప్యాక్డ్‌గా ఉంది. ఇక మార్చిలో లైగర్‌ను రిలీజ్ చేద్దామనుకుంటే ఆ సమయంలో కాలేజీ, స్కూల్ పిలల్ల ఎగ్జామ్స్. స్టూడెంట్స్, ఫ్యామిలీఆడియన్స్ థియేటర్స్‌కు రావడం కష్టమే..ఇలా సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయాలో అర్ధం కాక దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు లైగర్.
Read More: రానా పుట్టినరోజు సందర్భంగా విరాటపర్వం నుండి ‘వాయిస్ ఆఫ్ రవన్న’ విడుదలఇక కెరీర్ పరంగా కూడా విజయ్ దేవరకొండకు ఇబ్బందులు తప్పేలా లేవు. ‘లైగర్’ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా చేయాలి. కానీ ‘పుష్ప 2’ చిత్రాన్ని ఫిబ్రవరి నుంచే స్టార్ట్ చేస్తామని మైత్రీమూవీమేకర్స్ నిర్మాత నవీన్ చెప్పారు. దీంతో విజయ్–సుకుమార్ సినిమా ఇప్పట్లో సెట్స్‌కు వెళ్లే సూచనలు కనిపించడం లేదు. ఇక విజయ్–శివ నిర్వాణ కాంబినేషన్ మూవీ ఉంది. శంకర్ సినిమాకు బోల్డెంత ఖర్చు, సంక్రాంతి సినిమాల డిస్ట్రిబ్యూషన్ వంటి పనులతో ఈ సినిమాను నిర్మించాల్సిన దిల్ రాజు బీజీ. అలాగే టక్‌జగదీష్ ప్లాప్ కావడంతో మంచి స్క్రిప్ట్‌ను ప్రిపేర్ చేసేందుకు శివ నిర్మాణ టైమ్ తీసుకునేలా ఉన్నారు. ఇలా లైగర్ రిలీజ్ కుదరడం లేదు. నెక్ట్స్ సినిమాపై సరైన క్లారిటీ లేదు. సొంత ప్రొడక్షన్లో నిర్మించిన ‘పుష్పకవిమానం’ బాక్సాఫీసు వద్ద కుప్పకూలింది. ఇలా విజయ్‌దేవర కొండ పుల్ టెన్షన్లో ఉన్నాడు.