విడుదలకు సిద్ధంగా ఉన్న లవ్ మీ మూవీ.. సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది!

May 23, 2024

విడుదలకు సిద్ధంగా ఉన్న లవ్ మీ మూవీ.. సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది!

దిల్ రాజు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరో ఆశిష్ తాజా మూవీ లవ్ మీ. ఈఫ్ యు డేర్ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాని దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్సితా రెడ్డి, నాగమల్లిడి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సమర్పకుడిగా శిరీష్ వ్యవహరిస్తున్నారు. బలగం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆ సంస్థ నుంచి వస్తున్న సినిమా కావటంతో సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

అంతేకాకుండా ఇప్పటికే విడుదలైన టీజర్ కొత్తగా ఉండటం వలన సినిమా పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం ఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందించారు. అరుణ్ భీమవరపు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. మే 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో మూవీ నుంచి ఒక అప్డేట్ బయటికి వచ్చింది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకుంది.

సెన్సార్ బోర్డు ఈ సినిమాకి యు/ ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లు సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఒక దెయ్యంతో హీరో ప్రేమలో పడటం అనే కొత్త జానర్ స్టోరీ తో మన ముందుకి వస్తుంది ఈ సినిమా. అయితే సినిమాలో దెయ్యం పాత్రని ఎవరు పోషించారు అనే విషయం రివిల్ చేయలేదు మూవీ యూనిట్. ఈ చిత్రంలో ఎన్నో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నట్టు ఇప్పటికే మూవీ మేకర్స్ వెల్లడించారు.

ఇదొక న్యూ జనరేషన్ సినిమా, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది అంటున్నారు నిర్మాత దిల్ రాజు. ప్రేక్షకులకు మరిచిపోలేని సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని ఈ చిత్రం ఇస్తుందని యూనిట్ తెలిపింది.ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ పిసి శ్రీరామ్, ఎడిటర్ గా సంతోష్ కామిరెడ్డి వ్యవహరిస్తున్నారు.

Read More: బుజ్జి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నాగీ.. అది చాలా స్పెషల్ అంటూ స్టేట్మెంట్!

ట్రెండింగ్ వార్తలు