రీ ఎంట్రీ కన్ఫామ్ చేసిన లవర్ బాయ్.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్?

July 24, 2024

రీ ఎంట్రీ కన్ఫామ్ చేసిన లవర్ బాయ్.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్?

సినీ ఇండస్ట్రీలో ఒకప్పటి లవర్ బాయ్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు తరుణ్. బాల నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగిన ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో హీరోగా నటించి ఎంతో మంది అమ్మాయిలను అభిమానులుగా మార్చుకున్నారు. తరుణ్ హీరోగా నటించిన ప్రియమైన నీకు నువ్వు లేక నేను లేను వంటి సినిమాలు ఎంతో మంచి సక్సెస్ అందుకున్నాయి.

ఇలా ఈ సినిమాల ద్వారా స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న తరుణ్ వరుస సినిమాలలో నటిస్తూ వచ్చారు. అయితే ఈయన నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ అందుకోకపోవడంతో సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఇలా సినిమాలకు దూరమైనటువంటి తరుణ్ బిజినెస్లను చూసుకుంటూ బిజీగా ఉన్నారని ఇటీవల తన తల్లి రోజా రమణి ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.

ఇకపోతే తాజాగా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ కెప్టెన్ గా ఉన్నటువంటి తరుణ్ ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన తన రీ ఎంట్రీ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాను త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వబోతున్నానని తెలిపారు. ఒక సినిమా మరొక వెబ్ సిరీస్ కి కమిట్ అయ్యానని తెలిపారు.

ప్రస్తుతం వీటి పనులు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుందంటూ తరుణ్ గుడ్ న్యూస్ చెప్పడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈయన సోలో హీరోగా వస్తున్నారా లేకపోతే మల్టీ స్టార్ సినిమాగా వస్తున్నారా అనే విషయాల గురించి చాలా సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాలు అన్నిటికీ మరొక నెల రోజులలో క్లారిటీ రాబోతుందని తెలుస్తోంది.

Read More: Bigg Boss Telugu 8: ఇద్దరు స్టార్ కపుల్స్..బిగ్ బాస్ హిస్టరీలోనే ఫస్ట్ టైం?

Related News

ట్రెండింగ్ వార్తలు