పవన్ కళ్యాణ్ కు పోటీగా దుల్కర్ సల్మాన్.. ఓజీ సినిమా పోస్ట్ పోన్ అయ్యిందా?

May 30, 2024

పవన్ కళ్యాణ్ కు పోటీగా దుల్కర్ సల్మాన్.. ఓజీ సినిమా పోస్ట్ పోన్ అయ్యిందా?

దుల్కర్‌ సల్మాన్‌.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో మహానటి సినిమాతో తెలుగు సినిమా ప్రేక్షకులకు బాగా చేదువ అయ్యాడు సల్మాన్. ఆ తర్వాత సీతారామం సినిమాతో మరింత దగ్గర అయ్యాడు. ఇక ప్రస్తుతం తెలుగు తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీబిజీగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన తాజా చిత్రం లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరీ దర్శకత్వం వహించిన ఈ మూవీనీ సితార ఎంటర్టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్ లు ఈ సినిమాపై అంచనాలను పెంచాయి. కాగా తాజాగా ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. లక్కీ భాస్కర్ సినిమాని సెప్టెంబర్‌ 27న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించినందుకు దుల్కర్ సల్మాన్ అభిమానులు సంతోషపడుతుండగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆందోళన పడుతున్నారు. అందుకు గల కారణం కూడా లేకపోలేదు. అదేంటంటే సెప్టెంబర్ 27వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాను కూడా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

చాలా రోజుల క్రితమే ఈ విషయాన్ని వెల్లడించింది చిత్ర యూనిట్‌. అయితే సినిమా షూటింగ్ ఇంకా కొంచెం జరగాల్సి ఉంది. త్వరగా షూటింగ్‌ పూర్తి చేసి సెప్టెంబర్‌ 27న రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారు. కానీ ఇంతలోనే ఓజీ డేట్‌కి దుల్కర్‌ సల్మాన్‌ లక్కీ భాస్కర్‌ రాబోతుండటం విశేషం. అయితే దుల్కర్ సల్మాన్ పవన్ కళ్యాణ్ కి పోటీగా వస్తుండడంతో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా వాయిదా పడనుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఓ పెద్ద సినిమాకి పోటీగా అంటే ఎవరూ సాహసం చేయరు. దుల్కర్‌ లాంటి హీరో సాహసం చేస్తున్నారంటే అది ఆ డేట్‌ కి రావడం లేదనే అర్థం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ వార్త ఇప్పుడు పవన్‌ ఫ్యాన్స్‌ ని కలవరానికి గురి చేస్తుంది. పవన్‌ వస్తాడా రాడా అనేది మరింత ఆందోళన కలిగిస్తోంది.

Read More: ఐ ఫీస్ట్.. ‘పుష్ప 2: ది రూల్’ నుంచి కపుల్ సాంగ్.. సూసేకి అగ్గిర‌వ్వ మాదిరి వుంటాడే నా సామీ

ట్రెండింగ్ వార్తలు