ఆ బూతులేంటి.. ఇంత చీప్‌ బిహేవియర్‌..సంగీత దర్శకుడు కీరవాణిపై నెటిజన్ల ఫైర్‌

July 6, 2022

ఆ బూతులేంటి.. ఇంత చీప్‌ బిహేవియర్‌..సంగీత దర్శకుడు కీరవాణిపై నెటిజన్ల ఫైర్‌

ఒక సినిమా పబ్లిక్‌ డొమైన్‌లోకి వచ్చినప్పుడు టికెట్‌ కొన్న ఆడియన్‌కు తన అభిప్రాయం చెప్పే హక్కు ఉంటుంది. పొగడ్తలు అయిన, విమర్శలు అయిన దాన్ని గౌరవించాల్సిన బాధ్యత సదరు చిత్రయూనిట్‌ సభ్యులది. కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా విషయంలో మాత్రం కీరవాణి టైప్‌ జారారు. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’’ సినిమా తనకు చెత్తలా అనిపించిందని ఓ నెటిజన్‌ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయగా, ‘అది గే లవ్‌స్టోరీ’ అని ఆస్కార్‌ విన్నర్, సౌండ్‌ ఇంజినీర్‌ రసూల్‌ పుకూట్టి రెస్పాండ్‌ అయ్యారు.

కొందరు నెటిజన్లు, బాహుబలినిర్మాత ‘శోభు యార్లగడ్డ’ వంటి వారు రసూల్‌ను ప్రశ్నించారు. అయితే తాను పబ్లిక్‌ డొమైన్‌లో ఉన్నఅభిప్రాయాన్ని మాత్రమే చెప్పానని సమర్ధించుకున్నారు రసూల్‌. ఈ విషయం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ వరకు వెళ్లింది. దీంతో ఈ చిత్రం మ్యూజిక్‌ డైరెక్టర్‌ రసూల్‌ను ఉద్దేశిస్తూ… ట్వీట్‌ చేశారు. తప్పు తెలుసుకున్న కీరవాణి ఈ ట్వీట్‌ను ఆ తర్వాత డిలీట్‌ చేశారు.

https://twitter.com/mmkeeravaani/status/1544469984830636032

కానీ నెటిజన్లు అప్పటికే స్క్రీన్‌ షాట్స్‌ చేసేశారు. అభిప్రాయాలు ఎలా ఉన్నా..కీరవాణి వంటి దర్శకుడు ఇలా చీప్‌గా బిహేవ్‌చేయడం ఏంటి? నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. మరోవైపు ఈ ట్వీట్‌ను కవర్‌ చేయడానికి వ్యగ్యంగానే ఇప్పుడు మరొకొన్ని ట్వీట్స్‌ చేస్తున్నారు కీరవాణి. అయినా.. తెలిసి అడుసు తొక్కనేలకాలు కాలుకడగనేల. అందేనండీ..తెలిసి బురదలో కాలుపెట్టడం ఎందుకు… ఆ తర్వాత కాలు కడుక్కోవడంఎందుకు అని.

M. M. Keeravani tweets RRR rasool

M. M. Keeravani tweets RRR rasool

M. M. Keeravani tweets RRR rasool

M. M. Keeravani tweets RRR rasool

ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ విషయానికి వస్తే…రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. ఆలియాభట్, ఓలివియా మోరిస్‌ హీరోయిన్స్‌. అజయ్‌దేవగన్‌ కీలక పాత్రధారి. 2022 మార్చి 24న ఈ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓ డిసెంట్‌ హిట్‌గా నిలిచింది.

ట్రెండింగ్ వార్తలు