Mahaan Trailer: రియ‌ల్ తండ్రీ కొడుకుల రీల్ యుద్ధం మ‌హాన్‌

February 3, 2022

Mahaan Trailer: రియ‌ల్ తండ్రీ కొడుకుల రీల్ యుద్ధం మ‌హాన్‌

Mahaan Trailer: గ‌త కొంత కాలంగా స‌రైన హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో విక్ర‌మ్‌. ఆయ‌న సినిమా విజ‌యం సాధించి చాలా రోజులే అయింది. ఇప్పుడు మొద‌టిసారిగా విక్ర‌మ్ ఆయ‌న త‌న‌యుడు ధృవ్ విక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం `మ‌హాన్‌`. పిజ్జా, పేట, జిగర్ తండా లాంటి క్లాసిక్స్ ని తీసి మేకర్ గా త‌న‌కంటూ ఫాలోయింగ్ ఏర్ప‌ర‌చుకున్న కార్తీక్‌ సుబ్బరాజ్ జగమేతంత్రం తర్వాత ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. తండ్రీ కొడుకుల కాంబినేష‌న్లో వ‌స్తోన్న ఫ‌స్ట్ మూవీ కాబ‌ట్టి ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. అయితే ఈ చిత్రం అనూహ్యాంగా డిజిట‌ల్ రిలీజ్ ప్ర‌క‌టించి అభిమానుల ఆశ‌ల‌పై నీరు చ‌ల్లింది.

ఈ రోజు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. కాలేజీలో పిల్లకు పాఠాలు చెప్పే కామ‌ర్స్‌ టీచ‌ర్ గాంధీ మ‌హాన్‌ పాత్ర‌లో విక్ర‌మ్ క‌నిపించాడు. ఆయ‌న తండ్రి మద్యపాన నిషేదానికి వ్యతిరేకంగా పోరాడిన మహానుభావుడు. కొడుకు కూడా అదే జాడలో నడవాలని కోరుకుంటాడు. కానీ చాలీ చాలని జీతంతో ఇంటిని నెట్టుకురాలేకపోయిన గాంధీ ఏదైతే తన కుటుంబానికి వ్యతిరేకమో దాన్నే వ్యాపారంగా మ‌లుచుకుని సారాయి వ్యాపారంలో కింగ్ అవుతాడు. కానీ అనూహ్య పరిస్థితుల్లో తన వారసుడే(ధృవ్) అడ్డుగా మారడంతో ఇద్దరి మధ్య యుద్ధం మొదలవుతుంది. మహాత్ముడు కాలేక నేరస్థుడైన మహాన్ జీవితంలో చివరికి ఏం సాధించాడో తెలియాలంటే మ‌హాన్ చూడాల్సిందే..

ట్రైలర్(Mahaan Trailer)లో ఎంతో ఇంటెన్సిటీ క‌నిపిస్తోంది. అసాధార‌ణ న‌టుడు కాబ‌ట్టి ఎప్పటిలాగే విక్రమ్ రెండు షేడ్స్ లో పర్ఫెక్ట్ గా ఒదిగిపోయారు. ధృవ్ కూడా విక్ర‌మ్‌కి ధీటుగానే కనిపిస్తున్నాడు. ట్రైల‌ర్‌లో రివీల్ చేయ‌లేదు కాని పోలీసాఫీస‌ర్ లేదా ఆర్మీ పాత్ర‌ అయిఉండొచ్చు. ఇక బాబీ సింహా, సిమ్రాన్ లాంటి న‌టీన‌టుల‌తో క్యాస్టింగ్ గట్టిగానే ఉంది. సంతోషం నారాయణ్ సంగీతం, శ్రేయాస్ కృష్ణ ఛాయాగ్రహణం సినిమాలో హై స్టాండర్డ్ కి దన్నుగా నిలబడ్డాయి. విజువల్స్ కార్తీక్ సుబ్బరాజ్ స్టైల్ లోనే సాగాయి. ప్ర‌స్తుతం ట్రైల‌ర్‌ని బ‌ట్టి చూస్తే ఈ సినిమా మొద‌టిరోజు నుండే అమేజాన్ ప్రైమ్‌లో నెం1లో స్ట్రీమింగ్ అయ్యే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. మహాన్ ఈ నెల 10న అమెజాన్ ప్రైమ్ లో నేరుగా విడుదలవుతోంది. మ‌రి చూడాలి. ట్రైల‌ర్‌తో ఏర్ప‌డిన అంఛ‌నాల‌ను సినిమా అందుకుంటుందో లేదో..

Read More:  Gangubai Kathiawadi: అజయ్ దేవగన్ స్ట్రైకింగ్ ఫస్ట్ లుక్..రేపు ట్రైల‌ర్ రిలీజ్‌ 

ట్రెండింగ్ వార్తలు