August 30, 2022
అవును..మహేశ్‌బాబు సిక్స్‌ప్యాక్‌తో కొత్త లుక్‌లో కనిపించనున్నారని తెలిసింది. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత మహేశ్‌బాబుతో త్రివిక్రమ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘పార్థు’, ‘అర్జున్’ అనే పేర్లు తెరపైకి వచ్చాయి. హారిక–హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు(ఎస్. రాధాకృష్ణ) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను ఆగస్టులో స్టార్ట్ చేయాలనుకున్నారు కానీ కుదర్లేదు. దీంతో ఈ సినిమాను సెప్టెంబరులో స్టార్ట్ చేయాలనుకున్నారు. సెప్టెంబరు 5న రామెజీఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. అయి తే ఓ యాక్షన్ సీక్వెన్స్‌తో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తారు. మహర్షి సినిమా తర్వాత మహేశ్, పూజ కలిసి నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
మరోవైపు ఓ ప్రముఖ టీవీ చానెల్‌లో కనిపించేందుకు మహేశ్‌బాబు డీల్ కుదుర్చుకున్నాడు. ఈ చానెల్‌కు సంబంధించిన షోలు, టీవీ సీరియల్స్ గట్రాలో మహేశ్ గెస్ట్‌గా కనిపిస్తారు. మహేశ్‌బాబు కమర్షియల్ యాడ్స్‌పట్ల ఎంత కచ్చితంగా ఉంటారో అని చెప్పడానికి ఇదో నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న సినిమా వచ్చే ఏడాది చివర్లో స్టార్ట్ కానుంది. 2025లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.