May 27, 2024
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. నటుడిగా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి మహేష్ బాబు తాజాగా సోషల్ మీడియా వేదికగా తన కుమారుడు గౌతమ్ గురించి చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది. గౌతమ్ ఘట్టమనేని ప్రస్తుతం అమెరికన్ యూనివర్సిటీలో చదువుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.
ఈ మేరకు తన గ్రాడ్యుయేషన్ డేలో ఇలా సర్టిఫికేట్ తీసుకున్నాడు. ఇక తన కొడుకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినందుకు మహేష్ బాబు ఎంతో సంతోషంలో ఉన్నారు. గౌతమ్ గ్రాడ్యుయేషన్ సందర్భంగా మహేష్ బాబు ఫ్యామిలీ మొత్తం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే మహేష్ బాబు తన కొడుకు గౌతమ్ తో కలిసి దిగినటువంటి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన కొడుకు పట్ల చేసినటువంటి ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.గర్వంతో నా హృదయం నిండిపోయింది.. కంగ్రాట్స్ గౌతమ్.. మున్ముందు కూడా ఇలానే ఎదుగుతూ ఉంటావ్ అని నాకు తెలుసు.. నీ కలల్ని వెంటాడుతూనే ఉండు.. నేను తండ్రిగా ఈ రోజు ఎంతో గర్వపడుతున్నానని మహేష్ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
ఇక మహేష్ బాబు చేసినటువంటి ఈ పోస్ట్ పై గౌతమ్ లవ్ సింబల్స్ తో రియాక్ట్ అవ్వగా నమ్రత మాత్రం స్పీచ్ లెస్ అంటూ రియాక్ట్ అయ్యారు. ఈ ఫోటోలలో భాగంగా మహేష్ బాబు లుక్ వైరల్ గా మారింది ఇందులో ఈయన గడ్డంతో పాటు లాంగ్ హెయిర్ తో కనిపించడంతో ఈ లుక్ కాస్త వైరల్ గా మారింది. అయితే మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం గత కొద్దిరోజులుగా ఇదే లుక్ మెయింటైన్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.
Read More: అమ్మ చనిపోయిన తర్వాత వాటిపై నమ్మకం పెరిగింది.. శుక్రవారం ఆ పని చేయను: జాన్వీ కపూర్