June 15, 2024
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు మహేష్ బాబు. ప్రస్తుతం ఈయన వరుస సినిమాలకు కమిట్ అవుతూ బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ త్వరలోనే రాజమౌళి సినిమా పనులలో బిజీ కాబోతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్నారనే వార్తలు రావడంతోనే ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి.
ఇక రాజమౌళి సినిమా అంటే ఒక్కో హీరో దాదాపు రెండు మూడు సంవత్సరాలు పాటు రాజమౌళికి సమయం ఇవ్వాల్సిందే. ఆయన సినిమాలు అన్ని రోజులు షూటింగ్ జరుపుకోవడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన విజయాలను కూడా అందుకు ఉంటాయి. అందుకే ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ఆలస్యమైన రాజమౌళితో ఒక సినిమా అయినా చేయాలని భావిస్తూ ఉంటారు.
ఇక మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి గ్రౌండ్ లెవెల్ వర్క్ మొత్తం పూర్తి అయిందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు కూడా తనని తాను సిద్ధం చేసుకున్నారు. ఇక తన లుక్ కూడా పూర్తిగా మార్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభమైతే మహేష్ బాబు పక్కకు వెళ్లడానికి కూడా సమయం దొరకదు కనుక ఇప్పుడే తన ఫ్యామిలీతో సమయం దొరికినప్పుడల్లా వెకేషన్ వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మరోసారి ఈయన తన భార్య పిల్లలతో కలిసి వెకేషన్ వెళ్లారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో మహేష్‌బాబు పొడవాటి జుట్టు మరియు గడ్డంతో, నలుపు రంగు ట్రాక్ ప్యాంట్‌తో బ్రౌన్ కోటు మరియు డార్క్ కలర్ కాంబినేషన్ టోపీతో కనిపించారు. ఇక ఈ ఫోటోలలో మహేష్ వేసుకున్న లూయిస్ విట్టన్ క్రిస్టోఫర్ ఎంఎం బ్యాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ దీని కాస్ట్ ఎంతో తెలుసా.. అక్షరాలా 3.92 లక్షలు. అంటే దాదాపు 4 లక్షల రూపాయల బ్యాగ్ అన్నమాట. ఇలా బ్యాగ్ కోసం నాలుగు లక్షలు ఖర్చు చేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ సెలబ్రిటీలకు ఇలాంటివన్నీ సర్వసాధారణలోనే చెప్పాలి ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుంది.
Read More: ఆ సినిమా విడుదల రోజు చాలా భయపడ్డాను.. విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్!