తన డిజాస్టర్ సినిమాపై మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్.. గర్వంగా ఉందంటూ?

June 12, 2024

తన డిజాస్టర్ సినిమాపై మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్.. గర్వంగా ఉందంటూ?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈయన చివరిగా గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత రాజమౌళితో మరో సినిమాకి కమిట్ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయి.

ఇక ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో తన బావ సుదీర్ బాబు నటించిన హరోం హరా సినిమా ఈనెల 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే ఈయనతో కలిసి ఫోన్ లో చేసిన సంభాషణకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.  హరోం హరలో సుధీర్ బాబు ఎక్కువగా గన్స్ ఉపయోగించారు ఈ క్రమంలోనే సుదీర్ బాబు మహేష్ బాబుని ప్రశ్నిస్తూ..

మీరు నిజం సినిమాలో కూడా ఎక్కువగా గన్నులు ఉపయోగించారు కదా ఈ సినిమా విశేషాలు ఏవైనా గుర్తున్నాయా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు మహేష్ బాబు సమాధానం చెబుతూ.. నిజానికి నిజం సినిమా నాకు చాలా బాగా నచ్చిన సినిమా అని తెలిపారు. అలాంటి గొప్ప చిత్రాన్ని నాకు అందించినందుకు దర్శకుడు తేజకు థ్యాంక్స్‌ చెప్పాలి.

‘నిజం’ చేసినందుకు ఇప్పటికీ గర్వపడుతుంటాను అని చెప్పి షాక్ ఇచ్చారు. నిజం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘోరంగా డిజాస్టర్ అయ్యింది. ఇలాంటి డిజాస్టర్ సినిమా చేయడం మహేష్ అదృష్టం అని చెప్పడంతో ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రాజమౌళి సినిమాలో మహేష్ నటించబోతున్నారని తెలియడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్వరలోనే షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి.

Read More: డిప్యూటీ సీఎం గా పవన్ జీతం ఎంత.. ప్రభుత్వం నుంచి ఆయనకు అందే సౌకర్యాలు ఇవే?

ట్రెండింగ్ వార్తలు