ఆ హిట్ సినిమా వరకు మహేష్ బాబు రెమ్యూనరేషన్ తీసుకోలేదా.. బయటపడిన బిగ్ సీక్రెట్?

June 5, 2024

ఆ హిట్ సినిమా వరకు మహేష్ బాబు రెమ్యూనరేషన్ తీసుకోలేదా.. బయటపడిన బిగ్ సీక్రెట్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారిలో నటుడు మహేష్ బాబు ఒకరు సూపర్ స్టార్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తున్నటువంటి మహేష్ బాబు ప్రస్తుతం ఒక్కో సినిమాకు 50 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఇలా ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపార రంగంలో కూడా దూసుకుపోతున్నారు అలాగే ఎన్నో కమర్షియల్ బ్రాండ్స్ ప్రమోట్ చేస్తూ భారీ స్థాయిలో సంపాదిస్తున్నారు.

మహేష్ బాబు ఇలా ఒక వైపు సంపాదిస్తూనే మరోవైపు మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి పునర్జన్మను అందిస్తూ ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నటువంటి మహేష్ బాబు ఒక్కడు వంటి సూపర్ హిట్ సినిమా పడే వరకు రెమ్యూనరేషన్ అందుకోలేదు అంటూ తాజాగా ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

మహేష్ బాబు కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు అయితే ఈయన బాల నటుడిగా కృష్ణ నటించిన సినిమాలలో నటించారు. ఆయనకు కొడుకుగానూ తమ్ముడిగా కూడా మహేష్ బాబు నటించారు. ఇక హీరోగా ఈయన పలు సినిమాలలో నటించిన కెరియర్ మొదట్లో పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. ఒక్కడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత మహేష్ బాబు కెరియర్ పూర్తిగా మారిపోయిందని చెప్పాలి.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు ఒక ప్రశ్న ఎదురయింది. నిర్మాతలు నష్టపోతే కృష్ణ గారు డబ్బులు వెనక్కి ఇచ్చేవారు అలా మీరు కూడా ఇస్తున్నారా అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు మహేష్ బాబు సమాధానం చెబుతూ తాను కెరియర్ మొదటి భాగం వరకు రెమ్యూనరేషన్ తీసుకోలేదని అప్పటివరకు రెండు నిర్మాతలు ఎవరు కూడా నీకింత రెమ్యూనరేషన్ ఇవ్వలేదు ఏదో నాకు ఖర్చులకు మాత్రమే ఇచ్చేవారు. అలా నేను రెమ్యూనరేషన్ తీసుకోకపోవడం నిర్మాతలకు ప్లస్ పాయింట్ కదా అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Read More: పవన్ గెలుపు పై స్పందించిన రేణు దేశాయ్.. సంతోషంగా ఉన్నారంటూ?

ట్రెండింగ్ వార్తలు