ఆ సినిమా 100 సార్లు చూసి ఉంటా.. మహేష్ బాబు కామెంట్స్ వైరల్!

June 12, 2024

ఆ సినిమా 100 సార్లు చూసి ఉంటా.. మహేష్ బాబు కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో నటుడు మహేష్ బాబు ఒకరు. ఈయన సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి బాల నటుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. ఇక హీరోగా కూడా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఇలా నటుడిగా వరుస సినిమాలలో నటిస్తున్న ఈయన చివరిగా గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం రాజమౌళి సినిమా పనులలో బిజీగా ఉన్నారు.

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే తన లుక్ రివిల్ కాకుండా ఉండటం కోసం ఈయన ఇటీవల కాలంలో బయట ఎక్కడ కూడా మనకు కనిపించడం లేదు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు తన బావ సుదీర్ తో మాట్లాడిన ఒక ఆడియో కాల్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మహేష్ బాబు బావగా సుధీర్ బాబు కూడా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈయన త్వరలోనే హరోం హరా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూన్ 14వ తేదీ విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే ప్రమోషన్లలో భాగంగా మహేష్ బాబుతో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నటువంటి ఒక ఆడియో కాల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇందులో భాగంగా సుధీర్ బాబు ప్రశ్నిస్తూ హరోం హర సినిమా ఎక్కువగా గన్స్ ఉన్నాయి అలా గన్స్ ఎక్కువగా వాడిన సినిమాలలో మీకు ఏ సినిమా అంటే ఇష్టం అలాగే అలా గన్స్ వాడిన హీరోలలో ఎవరంటే ఇష్టమని ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు మహేష్ బాబు సమాధానం చెబుతూ కృష్ణ పేరు చెప్పారు. తన తండ్రి కృష్ణ గన్స్ ఎక్కువగా వాడిన మోసగాళ్లకు మోసగాడు సినిమా అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. నాన్న నటించిన సినిమాలలో నాకు ఈ సినిమా అంటే చాలా ఇష్టమని ఈ సినిమాని ఒక 100 సార్లు చూసి ఉంటాను అంటూ మహేష్ బాబు చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Read More: అల్లు అర్జున్ పై రెచ్చిపోతున్న కిరాక్ ఆర్పీ… ఆయన వెనుకున్నారనే ధైర్యమేనా?

ట్రెండింగ్ వార్తలు