రివేంజ్ డ్రామాగా  “మ‌ల్లితీగ” ప్రారంభం

November 19, 2021

రివేంజ్ డ్రామాగా  “మ‌ల్లితీగ” ప్రారంభం
శ్రీ నందనం క్రియేషన్స్ పతాకంపై జైరాజ్ జల్లూరి, ప్రవీణ్ పోతురాజు, సిమ్రాన్, హన్సిక శ్రీనివాస్, సుజాత, భరత్, చందు ప్రధాన పాత్రల్లో…పల్లి మోహన్ రావు దర్శకత్వంలో శ్రీను మోచర్ల నిర్మిస్తున్న చిత్రం “మ‌ల్లితీగ”. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల హైదరాబాద్ లో జరిగాయి. దర్శకుడు సముద్ర హీరో హీరోయిన్ల పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, నటుడు నిర్మాత డి.యస్. రావు మల్లితీగ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సంధర్భంగా…
నటుడు, నిర్మాత డి.యస్.రావు మాట్లాడుతూ – అంతా కొత్త వాళ్లతో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న ఈ “మల్లితీగ” సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారుదర్శకుడు సముద్ర మాట్లాడుతూ – ఈ చిత్ర మోషన్ పోస్టర్ చాలా బాగుంది. ఈ మల్లె తీగ చిత్రం ఎర్ర మల్లెలు అంత పెద్ద హిట్ అవ్వాలి. మంచి కథను సెలెక్ట్ చేసుకొని చేస్తున్న దర్శక, నిర్మాతలకు ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.చిత్ర నిర్మాత శ్రీను మోచర్ల మాట్లాడుతూ  – దర్శకుడు చెప్పిన కథ చాలా కొత్తగా అనిపించింది. ట్రైబల్ ఏరియాలో ఉన్న ఒక విలేజ్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. కొత్తవారితో చేస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ కచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం ఉందని అన్నారు.చిత్ర దర్శకుడు పల్లి మోహన్ రావు మాట్లాడుతూ   – ఇది నా మొదటి చిత్రం రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కథే హీరో. ఇందులో నటించిన హీరో హీరోయిన్లు, ఆర్టిస్టులు కేవలం కథకు ప్రాణం పోస్తారు. వైజాగ్ దగ్గర గుడివాడ పరిసర ప్రాంతంలో ఉన్న ఈ విలేజ్ ఎక్కడా మ్యాప్ లో కూడా లేదు గవర్నమెంట్ అండర్ లో లేని ఈ విలేజ్ కు సెట్ కూడా అవసరం లేదు. ఇది పూర్తి ట్రైబల్ లో ఉన్న ఈ  విలేజ్ ను సెలెక్ట్ చేసుకొని షూట్  షూటింగ్ చేస్తున్నాం.ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తాము.ఇలాంటి మంచి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించిన నిర్మాత శ్రీను మోచర్ల గారికి కృతజ్ఞతలు అన్నారు.

ట్రెండింగ్ వార్తలు