ఫ్లైట్ టికెట్ కొనడం కోసం కిడ్నీలు అమ్ముకునే పరిస్థితి వచ్చిందన్న మంచు ల‌క్ష్మి.

December 28, 2021

ఫ్లైట్ టికెట్ కొనడం కోసం కిడ్నీలు అమ్ముకునే పరిస్థితి వచ్చిందన్న మంచు ల‌క్ష్మి.

క‌లెక్ష‌న్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చేసింది త‌క్కువ సినిమాలై అయినా న‌టిగా మంచి గుర్తింపు ద‌క్కించుకుంది. పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించడంతో పాటు రియాలిటీ షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరించింది. తాజాగా మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎయిర్ పోర్ట్ లాంజ్ లో ఆకలి వేయకపోయినా అక్కడ ఆహారాన్ని తినేసానని…ఎందుకంటే తాను ఫ్లైట్ టికెట్ కొనడం కోసం కిడ్నీలు అమ్ముకునే పరిస్థితి వచ్చిందని ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది. ప‌రోక్షంగా ఫ్లైట్ టికెట్ ధర చాలా ఎక్కువగా ఉందని మంచు లక్ష్మి చెప్పకనే చెప్పేశారు. ఆ టికెట్ డబ్బులకు న్యాయం చేయాలనే ఆలోచనతో ఆక‌లి లేక‌పోయినా తాను ఆహారాన్ని తిన్నానని ఆమె వెల్లడించారు.

మంచు లక్ష్మి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్ల కామెంట్లకు మంచు లక్ష్మి తనదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు. ఒక నెటిజన్ మీరు కూడా మా కులమే అక్కా అని కామెంట్ చేయగా అవును బాబు మా డాడ్ రిచ్ అని నేను కాదని మంచు లక్ష్మి అన్నారు. మంచు లక్ష్మి తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలలో కూడా నటిస్తున్న విష‌యం తెలిసిందే..

ట్రెండింగ్ వార్తలు