మా నాన్న, నా ఫ్యామిలీ వల్ల నేను చాలా ఇబ్బందులు పడ్డాను.. మంచు లక్ష్మి సెన్సేషనల్ కామెంట్స్!

June 21, 2024

మా నాన్న, నా ఫ్యామిలీ వల్ల నేను చాలా ఇబ్బందులు పడ్డాను.. మంచు లక్ష్మి సెన్సేషనల్ కామెంట్స్!

సినీ ఇండస్ట్రీలో నటిగా విభిన్న సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు నటి మంచు లక్ష్మి. మోహన్ బాబు వారసురాలిగా ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అయితే ఈమె నటిగా అనుకున్న స్థాయిలో మాత్రం సక్సెస్ కాలేకపోయారని చెప్పాలి. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిస్తూ ఉన్న ఈమె ప్రస్తుతం ముంబైకి షిఫ్ట్ అయ్యారు.

ఇలా ముంబై వెళ్ళినటువంటి ఈమె బాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన కెరీర్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యల సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ తాను ముంబై రావడానికి ఇంట్లో చాలా ఫైట్ చేయాల్సి వచ్చిందని తెలిపారు.

నన్ను ముంబై షిఫ్ట్ అవ్వకూడదని ఇంట్లో వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు కానీ నేను వారితో ఫైట్ చేసే ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఇక ముంబై వెళ్ళిన ప్రతిసారి నేను రకుల్ ఇంట్లో ఉండే దానిని తెలిపారు. మన దక్షిణాది భారత దేశంలో ఒక స్టార్ హీరో కూతురు, చెల్లెలు సినిమాలలోకి రావడానికి ఇష్టపడరు. నేను కూడా అలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నానని తాను కూడా పితృస్వామ్య బాధితురాలి నేనని మంచు లక్ష్మి తెలిపారు..

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ప్రేక్షకులు ఒక హీరో కూతురు లేదా చెల్లెలు సినిమాలలో నటించిన అంగీకరించరని ఈమె తెలిపారు. ప్రకాశ్ కోవెలమూడి నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కానీ మా నాన్న మోహన్ బాబు, అతని నాన్న రాఘవేంద్ర రావు అది జరగకుండా చూడటానికి ప్రయత్నించారని లక్ష్మి చెప్పడం గమనార్హం. ఇలా తనకు సినిమాలలోకి రావాలని ఉన్నప్పటికీ తన తండ్రి ఈయన సినిమాలలో నటించడానికి ఒప్పుకోలేదని కానీ బలవంతంగా ఇండస్ట్రీలోకి వచ్చినట్టు ఈ సందర్భంగా మంచు లక్ష్మి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: చిరంజీవిని తలుచుకొని ఎన్నోసార్లు ఏడ్చాను.. ఆమని కామెంట్స్ వైరల్!

ట్రెండింగ్ వార్తలు