April 4, 2024
20 కోట్లు పెట్టుబడితో బాక్సాఫీస్ దగ్గర 200 కోట్లు కలెక్ట్ చేసిన మొట్టమొదటి మలయాళ సినిమాగా మంజుమ్మళ్ బాయ్స్ చరిత్ర సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి ఏ చిదంబరం ఎస్ పొదివల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా గుణ కేవ్స్ లో జరిగిన యదార్థ సంఘటనల స్ఫూర్తిగా తెరకెక్కిన సినిమా. సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలు పోషించారు.
పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఇండియన్ బాక్సాఫీస్ సెన్సేషన్ తెలుగు హక్కులు సొంతం చేసుకుంది. ఏప్రిల్ 6న మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మలయాళం లో సూపర్ హిట్ అయిన సినిమాలు తెలుగులో కూడా సూపర్ హిట్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే.
2018, ప్రేమలు సినిమాలు టాలీవుడ్ లో ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు మంజుమ్మల్ బాయ్స్ టైం. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా మైత్రి శశి మాట్లాడుతూ పెద్ద సినిమాలే కాకుండా దాదాపు 250 నుంచి 300 ధియేటర్లలో మంజుమ్మళ్ బాయ్స్ సినిమాని కూడా విడుదల చేస్తున్నాము. అలాగే ఈ సినిమాని ఏప్రిల్ 5న పెయిడ్ ప్రీమియర్లను ప్రదర్శిస్తున్నాము. దీనికి తెలుగు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మైత్రి శశి.
కొడైకెనాల్ లోని గుణ కేవ్స్ లో చిక్కుకున్న తన మిత్రుడిని రక్షించడం కోసం ఎర్నాకులం మంజుమ్మళ్ బాయ్స్ చేసిన సాహసోపేతమైన ప్రయత్నమే ఈ చిత్ర కథాంశం. మిత్ర బృందంలో ఒకరు గుహలోని లోతైన గుంటలో పడిపోవడం, అతన్ని రక్షించేందుకు తోటి మిత్రులంతా ప్రయత్నాలు ప్రారంభించడం, ఈ క్రమంలో ప్రభుత్వ బృందాలు, రంగంలోకి దిగటం వంటి సన్నివేశాలతో సినిమా ఆద్యంతం భావోద్వేగ భరితమైన సర్వైవల్ థ్రిల్లర్ గా ఈ సినిమా మన ముందుకి రాబోతుంది. ఈ చిత్రానికి సంగీతం సుశీన్ శ్యామ్ అందించగా, చాయాగ్రహణం సైజు ఖలీద్ అందించారు.
Read More: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ 171 మూవీ.. టైటిల్ ఏమిటంటే!