అమ్మతోడు నిన్ను అస్సలు వదలను..ప్రణీత్ కి మాస్ వార్నింగ్ ఇచ్చిన మనోజ్?

July 8, 2024

అమ్మతోడు నిన్ను అస్సలు వదలను..ప్రణీత్ కి మాస్ వార్నింగ్ ఇచ్చిన మనోజ్?

మంచు మనోజ్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఈయన ఇతర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక సమాజం పట్ల కూడా మంచు మనోజ్ ఎప్పటికప్పుడు స్పందిస్తూ సమాజంలో జరిగే సంఘటనల గురించి స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో స్పందించారు.

ప్రణీత్ హనుమంత్ అనే ఒక యూట్యూబర్ తన కొంతమంది స్నేహితులతో ఒక వీడియో కాల్ ద్వారా అమ్మాయిల గురించి చాలా విచక్షణ కోల్పోయి మాట్లాడారు తండ్రి కూతురు అని వరుసలు లేకుండా ఆడపిల్లల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నటువంటి కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలపై ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు స్పందిస్తూ మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి అంటూ విజ్ఞప్తి చేశారు.

ఇలాంటి నీచుల నుంచి పిల్లలను రక్షించుకోవడానికి ఒకటే మార్గం దయచేసి ఎవరూ కూడా మీ పిల్లల ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయకండి అంటూ తల్లిదండ్రులకు సూచించారు అయితే ప్రణీత్ హనుమంత్ అమ్మాయిల పట్ల చేసిన ఈ అనుచిత వ్యాఖ్యలపై మంచు మనోజ్ స్పందిస్తూ తనదైన స్టైల్ లోనే మాస్ వార్నింగ్ ఇచ్చారు.

అమ్మతోడు నిన్ను అసలు వదిలిపెట్టను అంటూ మనోజ్ ఆ వ్యక్తికి వార్నింగ్ ఇచ్చారు. చైల్డ్ సేఫ్టీ గురించి ఏడాది క్రితం తనని ఇంస్టాగ్రామ్ లో సంప్రదించానని అయితే ఇప్పటివరకు స్పందించలేదని మనోజ్ తెలిపారు. ఇలా స్పందించకపోవడం కాకుండా ఇప్పుడు ఆయనే పిల్లల గురించి ఇలా నీచమైన కామెంట్లు చేస్తున్నారని తెలిపారు. చిన్నపిల్లల విషయంలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు చేసే వారిని చూస్తుంటే భయంతో పాటు అసహ్యం వేస్తుంది అంటూ ఈ సందర్భంగా మంచు మనోజ్ వ్యక్తిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు

ట్రెండింగ్ వార్తలు