సాయిపల్లవి చేసిన తప్పే మారుతి చేశాడా?

July 1, 2022

సాయిపల్లవి చేసిన తప్పే మారుతి చేశాడా?

‘విరాటపర్వం’(Virata Parvam) చిత్రాన్ని ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన డి. సురేష్‌బాబు ముందుగా ఓటీటీకి ఇవ్వాలనుకున్నారు. కానీ థియేటర్స్‌ 100 శాతంతో నడుస్తున్న ఈ తరుణంలో రానా,(Rana) సాయిపల్లవి(Sai Pallavi), ప్రియమణి(Priyamani) వంటి స్టార్స్‌ కాస్టింగ్‌తో ఉన్న ‘విరాటపర్వం’ సినిమా థియేటర్స్‌లో వర్కౌట్‌ అవుతుందని మనసు మార్చుకున్నట్లున్నారు. అయితే ‘విరాటపర్వం’ సినిమా రిలీజైన తర్వాత ఈ సినిమాకు మంచి టాక్‌ వచ్చినా కలెక్షన్స్‌ మాత్రం దారుణంగా ఉన్నాయి. నంబర్స్‌ పరంగా ‘విరాటపర్వం’ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సాయిపల్లవి చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఈ సినిమాకు ఓ వర్గం ఆడియన్స్‌ దూరంగా ఉన్నారన్నది అప్పట్లో బలంగా వినిపించిన మాట.

ఇప్పుడు పక్కా కమర్షియల్ (Pakka Commercial)విషయంలోనూ ఇదే సీన్‌ రిపీట్‌ అయ్యేలా ఉంది. సినిమాలో ఓ సీన్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మూడు రాజధానుల ప్రస్తావనను తీసుకువచ్చారు చిత్ర దర్శకుడు మారుతి. ఇది సినిమాలో హాస్యంగానే ఉన్నా.. ఈ అంశానికి వైసీపీ అభిమానులు కాస్త హార్ట్‌ అయ్యారట. దీంతో ఈ సినిమాకు కాస్త దూరంగా ఉండాలనే ఆలోచన చేస్తారట ఏపీ సీయం జగన్‌ ఫ్యాన్స్‌ అండ్‌ కో. ఇదే నిజమైతే దగ్గ‌ర‌లో క‌మ‌ర్షియ‌ల్ సినిమా లేక‌పోయిన‌ప్ప‌టికి.. ‘పక్కా కమర్షియల్‌’ సినిమాకు నంబర్స్‌ పరంగా కాస్త ఇబ్బందులు తప్పవనే చెప్పాలి. అలాగే మహేశ్‌బాబు ‘సర్కారువారిపాట’(Sarkaru vaari Paata) సినిమా విషయంలోనూ ఇవే మాటలు వినిపించాయి. ఈ సినిమా గోదావరి జిల్లాలకు చెందిన ఓ రాజకీయ నేత వ్యవహారశైలిపై తీశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాదు..ఈ ప్రచారం ‘సర్కారువారి పాట’ బాక్సాఫీస్‌ను కూడా కాస్త నెమ్మద య్యేలా చేసింది. మరి..సాయిపల్లవి, మహేశ్‌బాబులు చేసిన తప్పిదాలే మారుతి కూడా చేశారా? అన్న విషయాలపై పూర్తి స్పష్టత రావాలంటే మరికొంత సమయం వేచి ఉండక తప్పదు.

ఇది కూడా చ‌ద‌వండి: ఆగస్టులో చిరంజీవి విదేశీ ప్రయాణం

ట్రెండింగ్ వార్తలు