December 27, 2021
Mega Appreciation for Sukumar: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌ను మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. అల్లు అర్జున్ హీరోగా మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన పాన్ ఇండియా మూవీ పుష్పను ఇటీవల మెగాస్టార్ ప్రత్యేకంగా వీక్షించారు. ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్‌ను తన నివాసానికి ఆహ్వానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా తనకెంతో బాగా నచ్చిందని, అన్ని భాషల్లో పుష్పకు లభిస్తున్న ఆదరణ పట్ల తనకెంతో ఆనందంగా ఉందని తెలిపారు. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ నటన చక్కగా ఉందని, సినిమాలోని ప్రతి అంశం ఎంతో అద్భుతంగా ఉందని చిరంజీవి కొనియాడారు. దర్శకుడుగా సుకుమార్ పడిన తపన, కష్టం ప్రతి ఫ్రేములో కనిపించిందని అందుకు తగ్గ ప్రతిఫలం బ్లాక్‌బస్టర్ రూపంలో తిరిగి వచ్చిందని దర్శకుడు సుకుమార్ పై ప్రశంసల ఝల్లు కురింపించారు మెగాస్టార్ చిరంజీవి.