సూప‌ర్‌స్టార్ యాక్ష‌న్ చూసేందుకు ఆతృత‌గా ఎదురుచూస్తున్న మెగాస్టార్‌

January 7, 2022

సూప‌ర్‌స్టార్ యాక్ష‌న్ చూసేందుకు ఆతృత‌గా ఎదురుచూస్తున్న మెగాస్టార్‌

నిన్న సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో ఆయ‌న సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి షూటింగ్ షురూ చేయాల‌ని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. అలాగే మ‌హేశ్ త్వ‌ర‌గా కోలుకోవాలంటూ ప‌లువురు సిని రాజ‌కీయ ప్ర‌ముఖులు సోషల్‌మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు. ఇప్ప‌టికే తారక్‌, సాయితేజ్‌, సత్యదేవ్ వంటి హీరోలు #GETWellSoonSSMB అని ట్వీట్ చేశారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి కూడా మ‌హేశ్ బాబు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకున్నారు. ‘‘గెట్‌ వెల్‌ సూన్‌ మహేశ్‌బాబు. నువ్వు త్వ‌ర‌గా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.నీ యాక్షన్‌ చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా’’ అని చిరు ట్వీట్‌ చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు