Megastar Chiranjeevi : ‘గాడ్ ఫాదర్’ హైద‌రాబాద్ షెడ్యూల్ పూర్తి

February 17, 2022

Megastar Chiranjeevi : ‘గాడ్ ఫాదర్’ హైద‌రాబాద్ షెడ్యూల్ పూర్తి

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) 153వ సినిమా `గాడ్ ఫాదర్’ ను ద‌ర్శ‌కుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ హైద‌రాబాద్ షెడ్యూల్ పూర్త‌య్యింది.

ఈ షెడ్యూల్‌లో న‌య‌న‌తార పాల్గొంది. హైద‌రాబాద్ షెడ్యూల్ పూర్త‌యిన‌ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మోహ‌న్‌రాజా, హీరోయిన్ న‌య‌న‌తార ఫోటోను షేర్ చేసింది చిత్ర యూనిట్‌.

హై ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రాబోతోన్న ఈ సినిమాలో చిరంజీవి(Megastar Chiranjeevi) పవర్ ఫుల్ రోల్‌లో కనిపించబోతోన్నారు. న‌య‌న‌తార పాత్ర‌కు మంచి ప్రాధాన్యం ఉండ‌నుంది.

ఈ సినిమా కోసం సాంకేతిక పరంగా అత్యున్నత స్థాయి టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. మాస్టర్ సినిమాటోగ్రఫర్ నీరవ్ షా కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక తమన్ అద్భుత‌మైన‌ సంగీతాన్ని అందించేందుకు సిద్దమయ్యారు. ఎన్నో బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌కు వ‌ర్క్ చేసిన సురేష్ సెల్వరాఘవన్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

Read More: Kalaavathi: సౌత్ ఇండియాలోనే ఎక్కువ మంది చూసిన పాట‌గా రికార్డు

ట్రెండింగ్ వార్తలు