అందాల‌తో అల‌రిస్తోన్న మృణాలిని..

October 4, 2021

అందాల‌తో అల‌రిస్తోన్న మృణాలిని..

సోషల్ మీడియాలో డ‌బ్‌స్మాష్‌ వీడియోల‌తో సెల‌బ్రిటీ స్టేట‌స్ అందుకున్న అందాల బామ మృణాళిని రవి….

హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ చిత్రంతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యమైంది.

మొద‌టి సినిమాలోనే మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ వంటి స్టార్ హీరో స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశం రావ‌డంతో ఆ అవ‌కాశాన్ని పూర్తిగా సద్వినియోగ‌ప‌రుచుకుంది మృణాలిని.

ఆ సినిమాలో త‌న హావ‌భావాలు, డ్యాన్స్‌ల‌తో ఆక‌ట్టుకుంది.

ఆ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ ఏర్ప‌డ‌డంతో వ‌రుస అవ‌కాశాలతో బిజీగా ఉంది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న లేటెస్ట్ ఫోటోల‌తో కుర్ర‌కారుకి మ‌రింత ద‌గ్గ‌ర‌వుతుంది.

ప్ర‌స్తుతం మృణాలిని విక్ర‌మ్ హీరోగా న‌టిస్తోన్న కోబ్రా సినిమాలో ఒక కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తోంది. అలాగే విశాల్‌, ఆర్య కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న ఎనిమి చిత్రంలో విశాల్ స‌ర‌న‌న హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఎంజీఆర్ మ‌గ‌న్ అనే త‌మిళ్ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. వీటితో పాటు అతి త్వ‌ర‌లో తెలుగులో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్‌ల‌లో క‌నిపించ‌నుంది ఈ ముద్దుగుమ్మ‌.

అందాల‌తో అల‌రిస్తోన్న మృణాలిని..

ట్రెండింగ్ వార్తలు