ప్రభాస్‌ని బావా అని పిలిచిన‌ మోహన్ బాబు…ఫ్యాన్స్ ట్రోలింగ్ మామూలుగా లేదు?

July 1, 2024

ప్రభాస్‌ని బావా అని పిలిచిన‌ మోహన్ బాబు…ఫ్యాన్స్ ట్రోలింగ్ మామూలుగా లేదు?
Kalki 2898 AD: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కల్కి సినిమా ద్వారా సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయం సొంతం చేసుకోవడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ఈ సినిమాపై ఎంతో మంది సెలబ్రిటీలు స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు కూడా కల్కి సినిమాపై స్పందించారు.

ఈ సందర్భంగా మోహన్ బాబు కలికి సినిమా గురించి ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ.. ఈరోజు నేను కల్కి సినిమా చూశాను. అద్భుతం.. మహా అద్భుతం మా బావ ప్రభాస్, అమితాబ్ బచ్చన్ గారికి, నిర్మాత డైరెక్టర్ కు నా అభినందనలు. తెలుగు సినీ పరిశ్రమ భారతదేశం గర్వించదగ్గ సినిమాని అందించినందుకు ధన్యవాదాలు అంటూ ఈయన పోస్ట్ చేశారు.

ఇలా మోహన్ బాబు చేసిన ఈ పోస్టులు ఏ విధమైనటువంటి ఇబ్బందికరమైన పదాలు లేవు కానీ ఈయన మాత్రం భారీ స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. అయితే ప్రభాస్ ను పట్టుకొని మోహన్ బాబు బావ అంటూ సంబోధించడమే ట్రోల్స్ కి కారణమని చెప్పాలి. మంచు ఫ్యామిలీ ఎలాంటి పోస్టులు చేసినా తప్పనిసరిగా ట్రోల్స్ ఎదుర్కొంటారు. ఈ క్రమంలోనే ఈయన ప్రభాస్ ని బావ అని సంబోధించడంతో మీ వయసు ఎక్కడ ప్రభాస్ వయసు ఎక్కడ బావ అనడం ఏంటి అంటూ భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.

ఈ విధంగా మోహన్ బాబు ప్రభాస్ ని బావ అనడానికి కూడా కారణం లేకపోలేదని చెప్పాలి మోహన్ బాబు ప్రభాస్ ఇద్దరు నటించిన బుజ్జిగాడు సినిమాలో వీరిద్దరూ బావ బావమరిది పాత్రలో నటించారు. ఈ క్రమంలోనే ప్రభాస్ ని సరదాగా మోహన్ బాబు బావ అంటూ సంబోధించారు. కానీ ట్రోలర్స్ మాత్రం ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ మోహన్ బాబుని ట్రోల్ చేయటం గమనార్హం

ట్రెండింగ్ వార్తలు